విజయ్ ‘వారసుడు’ ఆడియో లాంచ్.. డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్!

కోలీవుడ్ స్టార్ హీరోల్లో విజయ్ దళపతి ఒకరు.ఈయన రజనీకాంత్ తర్వాత తమిళ్ లో అంతటి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు.

వరుస హిట్స్ తో వందల కోట్లు వసూళ్లు చేస్తూ కోలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ డమ్ అందుకున్నాడు.

ఈయన గత సినిమా బీస్ట్ ప్లాప్ టాక్ తెచ్చుకున్న వసూళ్లు మాత్రం బాగా వచ్చాయి.

ప్రెజెంట్ విజయ్ తెలుగు డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు.విజయ్ దళపతి నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు వారసుడు అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు.

తమిళ్ లో 'వరిసు' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ క్రేజీ సినిమాపై ఇప్పటికే తమిళ్ లో అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.

టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.దిల్ రాజు భారీ స్థాయిలో శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా మరో అప్డేట్ బయటకు వచ్చింది.

"""/"/ఈ సినిమా నుండి ఇప్పటికే రంజితమే అనే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయగా థమన్ అందించిన సంగీతంతో సూపర్ హిట్ అయ్యింది.

ఇక ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటంటే.నవంబర్ 24, 2022న చెన్నై లో గ్రాండ్ గా ఆడియో ఫంక్షన్ ను చేయనున్నారని.

అందుకు మేకర్స్ అప్పుడే సన్నాహాలు కూడా చేస్తున్నారు అని కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

మరి సంక్రాంతి రేసులో ఉన్న ఈ సినిమాకు అప్పుడే ప్రొమోషన్స్ స్టార్ట్ చేయడంతో మంచి బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఖుష్బూ, మీనా, శ్రీకాంత్, జయసుధ, యోగిబాబు, శరత్ కుమార్ వంటి వారు నటిస్తున్నారు.

వైరల్.. ఇన్‌స్టాగ్రామ్ పరిచయంతో పెళ్లి చేసుకున్న వివాహిత మహిళలు