లియో ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. విజయ్ పవర్ఫుల్ లుక్ అదిరిందిగా!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి( Thalapathy Vijay ) ఈ రోజు తన పుట్టిన రోజు జరుపు కుంటున్నారు.

ఈ క్రమంలోనే ఈయన నటిస్తున్న లేటెస్ట్ సినిమా నుండి ఏదైనా అప్డేట్ వస్తుందా అని ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు.

మరి ఫ్యాన్స్ ఎదురు చూపులకు ఫలితంగా ఈయన నటిస్తున్న లియో సినిమా నుండి ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేయడంతో సందడి స్టార్ట్ అయ్యింది.

విజయ్ ఈ ఏడాది ఇప్పటికే 'వారిసు( Varisu )' సినిమాతో ఫ్యాన్స్ ను అలరించి బ్లాక్ బస్టర్ విజయం అందుకుని ఆ వెంటనే లియో సినిమాను స్టార్ట్ చేసాడు.

మరి ఈ సినిమా కూడా చివరి స్టేజ్ కు చేరుకుంది.విజయ్ నటిస్తున్న మోస్ట్ ఏవైటెడ్ సినిమా 'లియో'ను లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

మాస్టర్ వంటి బ్లాక్ బస్టర్ అందుకున్న కాంబో కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

""img Src=" " / ఈ సినిమా లోకేష్ ( Lokesh Kanagara )సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిస్తుండడంతో ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగాయి.

ఇక జూన్ 22న విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేయగా విజయ్ పవర్ఫుల్ లుక్ ఆకట్టుకుంటుంది.

ప్రజెంట్ ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అయ్యింది.మరి ఈ పోస్టర్ తోనే సరిపెడతారా లేదంటే గ్లింప్స్ కూడా రిలీజ్ చేస్తారా అనేది సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే.

""img Src=" " / ఇక ఈ సినిమాను అక్టోబర్ 19న దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.

వీడియో: వేగంగా వెళ్తూ బైక్‌ పైనుంచి కింద పడ్డ అమ్మాయి.. గాయాలు చూస్తే!!