రక్తపు మారకలతో షాక్ ఇచ్చిన విజయ్.. నెట్టింట ఫోటోలు వైరల్?

సాధారణంగా ఒక సినిమాను తెరకెక్కించాలంటే దర్శకనిర్మాతలు చిత్రబృందం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.ఆ సినిమా నుంచి ఏ విధమైనటువంటి సన్నివేశాలు ఫోటోలు బయటకు లీక్ కాకుండా జాగ్రత్తలు పడుతున్నప్పటికీ కొందరు లీకు రాయుళ్లు మాత్రం సినిమాకు సంబంధించినటువంటి కొన్ని సన్నివేశాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పెద్ద ఎత్తున వైరల్ చేస్తుంటారు.

ఇప్పటికే ఈ విషయంపై ఎంతో మంది దర్శక నిర్మాతలు హీరోలు గట్టిగా వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఈ లీకీకులపర్వం మాత్రం ఆగడం లేదు.

తాజాగా తమిళం స్టార్ హీరో విజయ్ హీరోగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న "బీస్ట్"అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుపుకుంటుంది.మాస్టర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ హీరోగా వస్తున్నటువంటి ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా తమిళనాడులోని బ్రిస్క్ అనే ప్రాంతంలో చిత్రీకరణ జరుపుకుంటోంది.ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో సినిమా షూటింగ్ జరుగుతుందన్న విషయాన్ని తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని షూటింగ్ జరుగుతున్నటువంటి సన్నివేశాలను ఫోన్లలో బంధించి వాటిని నెట్టింట్లో షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్తా వైరల్ గా మారాయి.

ఇందులో విజయ్ రక్తపు మరకలు ఉన్నటువంటి తెలుపు రంగు చొక్కాలో కనిపిస్తుండడంతో ఈ ఫోటో కాస్త వైరల్ గా మారింది.

ఈ క్రమంలోనే ఈ విషయంపై హీరో విజయ్ స్పందిస్తూ.అన్ అఫీషియల్ ఫోటోలు వీడియోలను చిత్రీకరించ్చ వద్దని తన అభిమానులకు రిక్వెస్ట్ చేశారు.

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు.

భార్యల సీటు కోసం బస్సులొ చెప్పులతో కొట్టుకున్న భర్తలు