‘లియో’ ఆడియో ఫంక్షన్ క్యాన్సిల్.. కారణం అదేనా?

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ జోసెఫ్( Thalapathy Vijay Joseph ) హీరోగా స్టార్ హీరోయిన్ త్రిష ( Trisha ) హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ''లియో''.

( Leo Movie ) సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్( Lokesh Kanagaraj ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'లియో' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఒక్కొక్కటిగా ఈ సినిమాపై వస్తున్న వార్తలకు ఈ సినిమాపై ఫ్యాన్స్ లో మరిన్ని హోప్స్ పెరుగుతున్నాయి.

సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమాను అక్టోబర్ 19న దసరా కానుకగా రిలీజ్ చేయనున్నారు.ఇక ఈ సినిమాలో అర్జున్ సర్జా,( Arjun Sarja ) సంజయ్ దత్ లు( Sanjay Dutt ) కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మరి రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ మేకర్స్ ప్రమోషన్స్ మరింత చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు.

"""/" / ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ సాంగ్, అనౌన్స్ మెంట్ గ్లింప్స్ అందరిని ఆకట్టుకుని సినిమాపై అంచనాలు మరిన్ని పెంచేసాయి.

ఇక ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్( Leo Audio Launch ) సెప్టెంబర్ 30న చేయాలని మేకర్స్ భావించారు.

కానీ మేకర్స్ ఊహించిన దాని కంటే ఎక్కువగా ఫ్యాన్స్ నుండి పాస్ లకు రిక్వెస్ట్ లు రావడంతో భారీగా అభిమానులు వచ్చే అవకాశం ఉందని గ్రహించారు.

"""/" / మరి అంత క్రౌడ్ ను మ్యానేజ్ చేయగలరో లేరో అని ఏదైనా చిన్న తప్పు జరిగిన ఇబ్బందులు ఉంటాయని మేకర్స్ ఆడియో ఫంక్షన్ ను క్యాన్సిల్ చేస్తున్నట్టు అఫిషియల్ గా ప్రకటించారు.

ఈ పోస్ట్ తో విజయ్ ఫ్యాన్స్ హార్ట్ అయినట్టు తెలుస్తుంది.కానీ తమ మంచికోసమే తీసుకున్న నిర్ణయం కాబట్టి ముందు ముందు వచ్చే అప్డేట్ లను ఎంజాయ్ చేస్తామని కొంత మంది అభిమానుల కామెంట్స్ చేస్తున్నారు.

ఎంత పల్చటి జుట్టు అయినా సరే ఇలా చేశారంటే రెండు నెలల్లో దట్టంగా మారుతుంది!