Vijay: చిరంజీవి, రవితేజ చేసిన తప్పే ఇప్పుడు విజయ్ కూడా..? అన్ని కోట్లు పోయినట్టేనా ?
TeluguStop.com
విజయ్ కుమార్.( Vijay Kumar ) తమిళ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఇతడు కూడా ఒకడు.
విజయ్ కి చాలా మంచి ఫాలోయింగ్ ఉంది.రజినీ కాంత్ తర్వాత విజయ్ కి ప్రజాదరణ తమిళ ఇండస్ట్రీలో చాలా ఎక్కువగా ఉంటుంది.
అయితే ఈ మధ్యకాలంలో విజయ్ కి భారీ డిజాస్టర్స్ ఒకటి తర్వాత ఒకటి పలకరిస్తున్నాయి.
ఇక వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ 68( Vijay68 ) అనే ఒక సినిమాలో నటిస్తున్నాడు.
ఈ సినిమాపై విజయ్ తో పాటు అతడి అభిమానులకు సైతం భారి అంచనాలు నెలకొని ఉన్నాయి.
అయితే వెంకట్ ప్రభు( Venkat Prabhu ) ఇంతకు ముందే నాగ చైతన్య తో తెలుగులో కస్టడీ అనే సినిమా తీసి భారీ డిజాస్టర్ ను తన అకౌంట్లో వేసుకున్నాడు.
"""/" /
అయితే 68 సినిమాలో విజయ్ 19 సంవత్సరాల వయసున్న పాత్రలో కూడా కొన్ని సీన్స్ చేయాల్సి ఉండగా అందుకోసం మరో నటుడుతో చేయించకుండా టెక్నాలజీని ఉపయోగించి విజయ్ తో సదరు సీన్స్ ని తెరకెక్కిస్తున్నారు.
ఇది వరకే ఇలాంటి హైటెక్నాలజీని ఉపయోగించి చిరంజీవి ఆచార్య సినిమాలో( Acharya ) సైతం యంగ్ గా కనిపించే పాత్రలో నటించగా, టైగర్ నాగేశ్వరరావు( Tiger Nageswara Rao ) సినిమాలో సైతం రవి తేజ ఇలాంటి సాహసానికి ఒడిగట్టాడు.
అయితే ఈ రెండు సినిమాలు కూడా భారీ డిజాస్టర్ గా మిగిలిన సంగతి మనందరికీ తెలిసిందే.
"""/" /
దాంతో విజయ్ చేయబోతున్న ఈ సీన్ గురించి తమిళనాడు లో చర్చ జోరుగా సాగుతుంది.
పైగా ఈ టెక్నాలజీ కోసం చాలా తక్కువ లెన్త్ ఉన్న సీన్స్ కోసం 8 కోట్ల రూపాయలకు పైగా ప్రొడ్యూసర్ తో ఖర్చు పెట్టిస్తున్నాడట విజయ్.
వెంకట్ ప్రభు కి ఇప్పటికే కస్టడీ వంటి డిజాస్టర్ ఉండి పైగా ఇలాంటి డిజాస్టర్ సెంటిమెంటు ఉన్నటువంటి సీన్స్ తీయించడం అనేది విజయ్ కి కూడా శాపంగా మారబోతుందనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ.
ఒక వైపు బీస్ట్, వారసుడు, లియో ఈ మూడు భారీ సినిమాలు డిజాస్టర్స్ కావడంతో ఖచ్చితంగా ఒక సినిమా విజయవంతం అవ్వాల్సిన పరిస్థితి విజయ్ కుమార్ కి ఉంది.
మరి ఈ టైంలో ఇలాంటి సాహసాలకు ఒడిగడుతున్న వెంకట ప్రభు విజయ్ కి ఇస్తాడో లేదో వేచి చూడాలి.
ఆయన నాకు ఎప్పటికీ ప్రత్యేకమే…. ఆ హీరో పై నటి త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు?