ఈ సూపర్ హిట్ కాంబో మళ్ళీ రిపీట్ కానుందా.. ఈసారైనా అలా చేస్తారా?
TeluguStop.com
కోలీవుడ్ స్టార్ హీరోల్లో దళపతి విజయ్ జోసెఫ్ ఒకరు.ఈయన తమిళ్ లో రజినీకాంత్ తర్వాత అంతటి ఫాలోయింగ్ సంపాదించుకుని కోలీవుడ్ లో తిరుగులేని స్టార్ హీరోగా నిలదొక్కుకున్నాడు.
తాజాగా విజయ్ సంక్రాంతి కానుకగా వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించగా.
రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. """/"/
ఈ సినిమా 250 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించి విజయ్ స్టామినా ఏంటో నిరూపించింది.
ఇదిలా ఉండగా ఈ కాంబో మరోసారి రిపీట్ కాబోతుంది అని టాక్ వస్తుంది.
విజయ్ దళపతి, వంశీ పైడిపల్లి, దిల్ రాజు కాంబోలో మరో మూవీ రానుందట.
ఈ ముగ్గురు కాంబోలో మరో మూవీ తెరకెక్కనుందని.ఇప్పటికే కథ చర్చలు కూడా పూర్తి అయ్యాయని.
పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో వంశీ ఉన్నారని కోలీవుడ్ మీడియా చెబుతుంది.
"""/"/
ఇక ప్రెజెంట్ విజయ్ వారసుడు రిలీజ్ అయిన వెంటనే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా స్టార్ట్ చేసాడు.
మాస్టర్ వంటి సినిమాను తెరకెక్కించి విజయ్ కు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన లోకేష్ కనకరాజ్ తో 'లియో' సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తుంది.ఇక ఈ సినిమా పూర్తి అయిన వెంటనే వంశీతో చేయబోయే సినిమా స్టార్ట్ కానుంది అని తెలుస్తుంది.
"""/"/
అయితే ఈ కాంబో ఈసారి కూడా తమిళ్ వర్షన్ లోనే సినిమా చేస్తే దెబ్బయిపోయే అవకాశం ఉంది.
ఎందుకంటే వారసుడు సినిమా కూడా ముందుగా బైలింగ్వన్ మూవీ అని చెప్పి చివరి నిముషంలో ఇది తమిళ్ సినిమా అని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసారు.
దీంతో ఈ సినిమాపై నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి.మరి ఈసారి అయినా దిల్ రాజు అటు తమిళ్ తో పాటు ఇటు తెలుగులో కూడా సినిమాను నిర్మిస్తేనే తెలుగు ప్రేక్షకులు ఆదరించే అవకాశం ఉంది.
రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడి మాత్రమేనా.. వరుసగా 8 హిట్లు సాధించారుగా!