అన్న క్యాంటీన్ లో భోజనం చేసిన అమ్మా రాజశేఖర్.. ఆయన ఇచ్చిన రివ్యూ ఇదే!

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్(Anna Canteen) ను తిరిగి ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఈ ఏడాది ఆదర్శ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి ఎంతోమంది కడుపు నింపుతున్నారు.

మొత్తం 17 జిల్లాలలో దాదాపు 99 అన్న క్యాంటీన్ కాను ప్రారంభించిన విషయం తెలిసిందే.

కేవలం ఐదు రూపాయలకే(Five Rupees) మంచి పోషకాలు కలిగిన, రుచికరమైన ఆహారాన్ని అందిస్తోంది కూటమి ప్రభుత్వం.

ఒక్క పేద ప్రజలు మాత్రమే కాకుండా ఎంతోమంది ఇందులో భోజనం చేస్తున్న విషయం తెలిసిందే.

సెలబ్రిటీలు కూడా ఈ అన్నా క్యాంటీన్ లో భోజనం చేస్తున్నారు. """/" / తాజాగా టాలీవుడ్ ప్రముఖ సీనియర్ కురియోగ్రాఫర్ డైరెక్టర్ అమ్మా రాజశేఖర్(Senior Choreographer And Director Amma Rajasekhar) కూడా అన్న క్యాంటీన్ లో భోజనం చేశారు.

తాజాగా ఫిబ్రవరి 06 గురువారం నాడు విశాఖపట్నం లోని అన్న క్యాంటీన్‌ లో అమ్మా రాజశేఖర్(Amma Rajasekhar) భోజనం చేశారు.

ఆయన దర్శకత్వం వహించిన తల సినిమా రిలీజ్‌ కి రెడీ కావడంతో ప్రమోషన్స్‌ లో భాగంగా వివిధ ప్రాంతాలకు తిరుగుతున్నారు.

ఈ సినిమాతో అమ్మా రాజశేఖర్ కొడుకు రాగిన్ రాజ్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు.

ఈ సినిమాలో ముక్కు అవినాష్ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.చిత్ర బృందం గురువారం నాడు విశాఖలోని అన్న క్యాంటీన్‌లో స్థానికులతో పాటు క్యూలో నిలబడి టోకెన్ తీసుకుని భోజనం రుచి చూశారు.

"""/" / స్థానికులతో కాసేపు సరదాగా గడిపి భోజనం గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా అమ్మా రాజశేఖర్ మాట్లాడుతూ.అన్న క్యాంటీన్ భోజనం కమ్మగా ఉందది.

ఇక్కడ భోజనం చేయడం చాలా ఆనందంగా ఉందది.జీవితంలో మర్చిపోలేను అని తెలిపారు అమ్మ రాజశేఖర్.

ఆయన కొడుకు రాగిన్ రాజ్ కూడా తండ్రి బాటలోనే అన్న క్యాంటీన్ భోజనం బాగుందని అన్నారు.

ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.