చూస్తుండగానే 25 మంది విద్యార్థులు బస్సులోనే సమాధి..

ఈ మధ్యకాలంలో కొన్ని సందర్భాలలో అప్పటివరకు మనతోపాటు ఉండి ఎంతో సరదాగా గడిపిన వ్యక్తులు కూడా మరు క్షణంలో పరలోకానికి వెళ్లిపోయిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి.

ఇలాంటి ఘటనలకు సంబంధించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు ఉన్నాయి.తాజాగా అప్పటివరకు వారి స్నేహితులతో ఎంతో సరదాగా గడుపుతున్న విద్యార్థులు( Students ) సజీవ దహనం అయ్యారు.

ఓ ఏసీ బస్సులో కళ్ళముందే నడి రోడ్డుపై బస్సులో మంటలు చెలరేగడంతో అందులోని 25 మంది స్కూల్ పిల్లలు సజీవ దహనం అయ్యారు.

ఈ ఘటన థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ నగరం నడిబొడ్డున జరిగింది.ప్రస్తుతం ఈ ఘటన ప్రపంచాన్ని కల్చివేసిందని చెప్పవచ్చు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే. """/" / బ్యాంకాక్ నగరం( Bangkok ) శివారులలో ఉన్న ఉత్తాయి థని అనే చిన్న ఊరు ఉంది.

ఆ ఊరిలో ఖావోఫామ పాఠశాల ఉంది.అయితే పాఠశాల యాజమాన్యం స్కూలులోని ఏడవ, ఎనిమిదో తరగతి పిల్లల కోసం ఓ విహారయాత్రను ఏర్పాటు చేసింది.

ఇందులో భాగంగానే ఓ ఏసీ బస్సును( AC Bus ) కూడా ఏర్పాటు చేశారు.

అందులో 44 మంది పిల్లలతో కలిసి ఎంతో ఉత్సాహంగా కేరింతలు కొడుతూ బస్సు ప్రయాణం జరుగుతోంది.

ఉదయం 9 గంటల సమయంలో స్కూలు నుంచి బయలుదేరిన బస్సు బ్యాంకాక్ ఉత్తర ప్రాంతమైన పాతుంథని అనే ప్రాంతానికి వచ్చిన సమయంలో బస్సు డ్రైవర్ ఒక్కసారిగా అదుపుతప్పాడు.

దాంతో బస్సు రోడ్డు పక్కనే ఉన్న డివైడర్ ను బలంగా ఢీ కొనింది.

దాంతో వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి.ఏసీ బస్సు అవడంతో మంటలు క్షణాల వ్యవధిలో బస్సు అంతా వ్యాపించాయి.

"""/" / దానితో బస్సులను పిల్లలను రక్షించడానికి స్కూల్ సిబ్బంది ఎంతో ప్రయత్నం చేశారు.

ఘటనలో బస్సులోని 19 మంది పిల్లలను రక్షించగా.మిగతా 25 మంది పిల్లలు బస్సు మంటల్లో చిక్కుకొని సజీవ దహనం అయ్యారు.

ఈ ఘటన తెలుసుకున్న వెంటనే పోలీసులు ఫైర్స్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని అదుపులోకి తీసుకోవచ్చారు.

అయితే అప్పటికే జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిపోయింది.ఈ ఘటనకు సంబంధించి ఉన్నత స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వ మంత్రి.

పిల్లలని కోల్పోయిన తల్లిదండ్రులు విషయం తెలిసి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.విహారయాత్రకు వెళ్లి వస్తానని ఎంతో ఆనందంగా చెప్పిన పిల్లలు ఇక తిరిగరాని లోకాలకు వెళ్లారు అంటూ బోరున విలువించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది.

రూ.20 వేలతో కొన్న బైక్‌కు రూ.60 వేలతో బరాత్‌.. చివరకు షాకిచ్చిన పోలీసులు..