ఆ రెస్టారెంట్‌లో కింగ్‌కోబ్రా మాంసంతో వంటకాలు.. వీడియో చూస్తే ఒళ్ళు జలదరిస్తుంది..
TeluguStop.com
ఓ మహిళ పాము మాంసాన్ని( Snake Meat ) తయారు చేస్తున్న వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.
ఈ వీడియో @Travelicious అనే యూట్యూబ్ ఛానెల్ షేర్ చేసింది.ఈ వీడియోలో సదరు మహిళ కింగ్ కోబ్రా పాము మాంసాన్ని ఉపయోగించి రుచికరమైన వంటకం చేస్తున్నట్లు కనిపించింది.
దీనిని బ్యాంకాక్‌లోని కోబ్రా రెస్టారెంట్ అనే రెస్టారెంట్‌లో రికార్డ్ చేశారు, సాధారణ మాంసం వలె పాము మాంసాన్ని ఈ రెస్టారెంట్ విక్రయిస్తోంది.
"""/"/
ఈ వీడియోలో ఉన్న మహిళ మొదట పామును ఎంచుకుని చంపింది.తరువాత ఆమె పామును క్లీన్ చేసి దాని లోపలి భాగాన్ని బయటకు తీస్తుంది.
ఆ తర్వాత పాము తోలు తీసి చిన్న ముక్కల మాంసంగా కట్ చేసింది.
ముక్కలు చేసిన మాంసాన్ని మసాలా, కూరగాయలతో కలిపి వండుతుంది.మిగిలిన పాము మాంసం ముక్కలను డీప్ ఫ్రై చేసింది.
చివరికి, ఈ రెండు వంటకాలను మందంగా కనిపించే పానీయం లేదా సాస్‌తో వడ్డిస్తుంది.
ఈ దృశ్యాలను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. """/"/
ఈ వీడియో యూట్యూబ్‌లో వేల వ్యూస్, వందల కొద్దీ లైక్‌లను పొందింది.
నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్స్‌లో వ్యక్తం చేస్తున్నారు, కొంతమంది వీడియో చూస్తుంటేనే భయమేస్తోందని దాన్ని ఎలా తింటారని కామెంట్లు పెట్టారు.
థాయ్‌లాండ్‌లో పాము మాంసాన్ని రుచికరమైనదిగా పరిగణిస్తారు, తరచుగా స్టైర్-ఫ్రైస్, కూరలు, సూప్‌ల వంటి వంటలలో ఉపయోగిస్తారు.
పాము మాంసం( King Cobra Meat ) కూడా ఔషధ గుణాలను కలిగి ఉందని భావించి కొన్నిసార్లు ఆర్థరైటిస్, రుమాటిజం వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు.
ఇండియాలో పొట్లకాయలను వాడినట్లు వారు పాములను వంటల్లో వాడుతారు.పాము మాంసాన్ని తీసుకోవడం కొందరికి వింతగా అనిపించినా, విభిన్న సంస్కృతులకు భిన్నమైన వంట సంప్రదాయాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి.
ఈ సింపుల్ మాస్క్ తో ఇంట్లోనే లాంగ్, సిల్కీ అండ్ షైనీ హెయిర్ ను మీ సొంతం చేసుకోండి!