75 వేల కోసం ప్రాణాలు కోల్పోయిన థాయ్ ఇన్‌ఫ్లుయెన్సర్.. అసలేం జరిగిందో చూస్తే?
TeluguStop.com
థాయ్‌లాండ్‌కు చెందిన పాపులర్ సోషల్ మీడియా (Social Media)ఇన్‌ఫ్లుయెన్సర్ థానకర్న్ కంఠీ(Thankakarn Kanthi అలియాస్ "బ్యాంక్ లీసెస్టర్" (21) ఓ విస్కీ ఛాలెంజ్‌లో ప్రాణాలు కోల్పోయాడు.
రెండు బాటిళ్ల విస్కీ(Whiskey) తాగితే 30,000 థాయ్ బాట్ (దాదాపు రూ.75,228) ఇస్తామని ఆఫర్ చేయడంతో అతను ఈ ఛాలెంజ్‌కు ఒప్పుకున్నాడు.
కానీ, అది అతని పాలిట మరణ శాసనంగా మారింది.ఈ ఇన్సిడెంట్ డిసెంబర్ 25న చంతబురిలోని థా మై డిస్ట్రిక్ట్‌లో (my District)జరిగిన ఓ బర్త్‌డే పార్టీలో జరిగింది.
థానకర్న్ ఇలాంటి డేంజరస్ ఛాలెంజ్‌లు చేయడం కొత్తేమీ కాదు.ఇంతకుముందు హ్యాండ్ శానిటైజర్ (Hand Sanitizer)తాగడం, వసాబీ తినడం లాంటివి కూడా చేశాడు.
ఈసారి ఒక్కో బాటిల్‌కు 10,000 బాట్ చొప్పున 350ml రెజెన్సీ విస్కీ బాటిల్ తాగమని చెప్పారు.
అప్పటికే ఫుల్లుగా తాగి ఉన్న థానకర్న్, ఛాలెంజ్‌ను యాక్సెప్ట్ చేసి 20 నిమిషాల్లో రెండు బాటిళ్లు ఖాళీ చేశాడు.
ఆ వెంటనే ఆల్కహాల్ ఓవర్‌డోస్ అవ్వడంతో స్పృహ తప్పాడు.హాస్పిటల్‌కి తీసుకెళ్లేలోపే చనిపోయాడని డాక్టర్లు చెప్పారు).
"""/" /
విస్కీ ఛాలెంజ్ విషాదంలో ప్రధాన నిందితుడైన ఎక్కచార్ట్ మీఫ్రోమ్ అలియాస్ "ఎమ్ ఎక్కచార్ట్"(M Ekkachart)ను పోలీసులు అరెస్ట్ చేశారు.
థానకర్న్‌తో ఈ డేంజరస్ ఛాలెంజ్ చేయించింది ఇతనే అని తేలింది.పోలీసులు ఎక్కచార్ట్ ఇంట్లో రైడ్ చేయగా, పిస్టల్, బ్యాంక్ పాస్‌బుక్స్, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు(Pistol, Bank Passbooks, Mobile Phones, SIM Cards) బయటపడ్డాయి.
ఈ ఛాలెంజ్‌ను తానే ఆర్గనైజ్ చేసినట్లు ఎక్కచార్ట్ కన్ఫెస్ చేశాడు.పార్టీని అతని మదర్ సుప్రనీ ఫూన్‌కాసి హోస్ట్ చేసింది.
నిర్లక్ష్యంగా ప్రవర్తించి ఓ వ్యక్తి చావుకు కారణమైనందుకు ఎక్కచార్ట్‌కు గట్టిగానే శిక్ష పడే ఛాన్స్ ఉంది.
పది సంవత్సరాల వరకు జైలు శిక్ష, 20,000 బాట్ (దాదాపు ₹50,152) ఫైన్ కూడా పడొచ్చు.
"""/" /
ఈ ఘటనతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఫుల్లుగా ఫైర్ అవుతున్నారు.
ఛాలెంజ్‌ను ఆపకుండా చూస్తూ ఊరుకున్న పార్టీకి వచ్చిన వాళ్ళందరినీ ట్రోల్ చేస్తున్నారు.థానకర్న్ కుప్పకూలినప్పుడు కూడా అక్కడున్న వాళ్లు చీర్ చేయడం వీడియోలో క్లియర్‌గా కనిపిస్తోంది.
ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.థానకర్న్ ఇంతకుముందు సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్‌లో, తన ఫ్యామిలీని సపోర్ట్ చేయడం కోసమే ఇలాంటి రిస్కీ పనులు చేస్తున్నానని చెప్పుకొచ్చాడు.
వాళ్ల సర్వైవల్ కోసం ఎన్ని అవమానాలైనా, బెదిరింపులైనా భరిస్తానని చెప్పాడు.ఇది చదివిన వాళ్లంతా ఎమోషనల్ అవుతున్నారు.
ఇండియన్ పాలిటిక్స్ లో బాబాయ్ రియల్ గేమ్ ఛేంజర్…చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!