మేము కూడా తన ఫ్యామిలీ అని బన్నీ ప్రూవ్ చేశారు.. సుకుమార్ భార్య కామెంట్స్ వైరల్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ లో అల్లు అర్జున్ ( Allu Arjun )సుకుమార్లు కూడా ఒకరు.

వీరి స్నేహం గురించి మనందరికీ తెలిసిందే.అప్పుడెప్పుడో ఆర్య సినిమాతో మొదలైన వీరి స్నేహం పుష్ప 2( Pushpa2 ) వరకు అలాగే కొనసాగుతూ వస్తోంది.

ఎంతమంది వారిని విడదీయాలని చూసినా కూడా అవేమీ పట్టించుకోకుండా నవ్వుతూ ఫ్రెండ్షిప్ ని ముందుకు తీసుకెళుతున్నారు.

ఇక ఇటీవల సుకుమార్ భార్య తబితా ( Tabitha )సమర్పణలో వచ్చిన మారుతీనగర్ సుబ్రమణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి బన్నీ రావడం అందరినీ ఒకింత ఆశ్చర్యపరిచింది.

అంత చిన్న సినిమాకు అల్లు అర్జున్ రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. """/" / దానికి తోడు ఎందుకంటే సుకుమార్, బన్నీకి ( Sukumar, Bunny )మధ్య విభేదాలు వచ్చాయనే రూమర్స్ వేళ , మెగా ఫ్యామిలీతో కూడా వివాదం నడుస్తున్న వేళ బన్నీ ఇలా పబ్లిక్‌గా ఒక ఈవెంట్‌కి రావడం, అంతే కాన్ఫిడెంట్‌గా తన ఫ్యాన్స్‌కి పుష్ప 2పై బూస్ట్ ఇవ్వడం చాలా హ్యాపీ అనిపించింది.

తాజాగా దీనిపై సుకుమార్ భార్య మరొక సారి బన్నీకి థ్యాంక్స్ చెప్పారు.ఈ మేరకు ఆమె ఈ విధంగా రాసుకొచ్చారు.

బన్నీకి ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు తెలీడం లేదు.ఎందుకంటే పుష్ప 2 క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుంది ఇప్పుడు రోజూ ప్యాకప్ అయ్యే టైమ్‌కి బన్నీ ఎంత అలసిపోతున్నాడో మాకు తెలుసు.

ఎందుకంటే రోజూ షూటింగ్ అయ్యాక ఆయన ఫేస్ చూస్తేనే తెలుస్తుంది. """/" / అందుకే మారుతీ నగర్ సుబ్రమణ్యం( Maruti Nagar Subramaniam ) ప్రీ రిలీజ్‌ కి అల్లు అర్జున్‌ని పిలుద్దాం అనుకున్నప్పుడు సుక్కుతో కూడా నేను డిస్కస్ చేయకుండా డైరెక్ట్ రామోజీ ఫిలిం సిటీ షూటింగ్‌కి వెళ్లిపోయాను.

బన్నీ కేరవ్యాన్‌ లో ఉంటే ఇలా నేను ఫస్ట్ టైమ్ సినిమాను ప్రజెంట్ చేస్తున్నాను, మీరు తప్పకుండా రావాలి, ఇంట్లో ఉన్న మీరు, సుక్కును కాకుండా నేను ఎవరిని అడుగుతాను అని చెప్పాను.

ఆయన మొన్న అదే విషయాన్ని స్టేజ్ మీద కూడా చెప్పారు.దీని ద్వారా మేము తన ఫ్యామిలీ అని బన్నీ ప్రూ చేశారు.

అందుకే నేను బన్నీకి చాలా థ్యాంక్స్ చెబుతున్నాను.మీ వల్లే నేను నమ్మిన సబ్జెక్ట్ ఇంతలా జనాల్లోకి వెళ్లింది.

లేకపోతే ఇంతమంది ఆడియన్స్‌ను ఈ సినిమా థియేటర్‌కి తీసుకొచ్చి ఉండదు అని సబితా చెప్పుకొచ్చారు.

కువైట్‌లో నన్ను చంపేసేలా ఉన్నారు.. దయచేసి కాపాడాంటి అంటూ (వీడియో)