వైరల్ వీడియో: ఇలాంటి వికృతానందం సరి కాదంటూ హెచ్చరిక చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్..

సోషల్ మీడియాలో కొంత మంది ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు.

ముఖ్యంగా రీల్స్ చేస్తూ బాగా ఫేమస్ అవ్వాలని ఎంతోమంది రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నారు.

అయితే మామూలుగా రిల్స్ చేస్తే ఎవరు చూడరని కాస్త వెరైటీగా వీడియోలు చేయాలని.

చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకున్న వారు కూడా ఎందరో.అంతేకాదు చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు.

మరికొందరైతే రోడ్లపై పబ్లిక్ లో రొమాన్స్ చేస్తూ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పాపులర్ కావడానికి కూడా ప్రయత్నించారు.

ఇకపోతే తాజాగా హైదరాబాద్ నగరంలో వ్యక్తి డబ్బులు నడిరోడ్డుపై వెదజల్లుతూ చేసిన వీడియోలు కూడా బాగా పాపులర్ అయ్యాయి.

"""/" / అయితే ఆ తర్వాత అతనిని పోలీసులు అరెస్టు చేయడం అది వేరే సంగతి అనుకోండి.

ఇకపోతే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ వీడియో ప్రకారం.

ఓ వ్యక్తి ఛాలెంజ్ చేశాడు.అందులో అతడు ఏపీఎస్ఆర్టీసీ బస్సును( APSRTC Bus ) ఆపి వెంటనే పరిగెత్తాలని చాలెంజ్ చేశారు.

అయితే అతడు వెంటనే రోడ్డుపైకి వెళ్లి ఎదురుగా వస్తున్న పల్లె వెలుగు బస్సును( Palle Velugu Bus ) ఆపేందుకు చేయి ఊపాడు.

దీంతో ఆ బస్సు డ్రైవర్ మామూలుగానే ప్యాసింజర్లు చెయ్యి ఆపితే ఆపే విధంగానే బస్సును ఆపాడు.

అయితే ఆ వ్యక్తి బస్సు ఎక్కినట్లే ఎక్కి బస్సు దిగి అక్కడ నుంచి పారిపోయాడు.

"""/" / ఆ తర్వాత తాను చాలెంజ్ గెలిచినట్లు చెప్పి తనను ఫాలో అవ్వాలంటూ కోరాడు.

అయితే ఈ వీడియో పై తాజాగా తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్( Sajjanar ) స్పందించారు.

సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడం కోసం ఇలాంటి వెర్రి చేష్టలు చేయడం అవసరమా అంటూ.

ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారికి అసౌకర్యం కలిగిస్తుందని., మతిస్థిమితం లేకుండా కొందరు ఇలా వికృతానందం పొందుతున్నారంటూ ఆయన మండిపడ్డారు.

ముఖ్యంగా లైకులు, కామెంట్ల కోసం ఇలాంటి పిచ్చి పనులు మానుకోండి.బంగారు భవిష్యత్తు వైపుకు బాటలు వేయండి.

జీవితంలో ఉన్నతంగా ఎదగండి అంటూ.ఆయన ట్వీట్ చేస్తూ ఏపీ పోలీసులను ట్యాగ్ చేశారు.

యూఎస్ లో ప్రీ సేల్స్ విషయంలో దేవర అరాచకం.. ఈ రికార్డ్స్ ఎవరికీ సాధ్యం కాదంటూ?