తెలంగాణ జర్నలిస్టులకు ఇళ్లను పంపిణీ చేసే ఆలోచనలో ప్రభుత్వం.. దీని భావం ఏంటో మహాశయా.. ?

ఏదైనా పోరులో వెనబడుతున్న సమయంలో ఎక్కడలేని బలాన్ని పుంజుకుని గెలవడానికి ప్రయత్నిస్తాడు మనిషి.

ఈ సూత్రాన్నే రాజకీయాల్లో పాటిస్తుంటారు నేతలు.ఇన్నాళ్లూగా జర్నలిస్టుల ఊసెత్తని తెలంగాణ ప్రభుత్వానికి సడెన్‌గా వీరి పై ప్రేమ పుట్టింది కావచ్చనే గుసగుసలు మొదలయ్యాయట.

దీనికి కారణం బుధవారం జర్నలిస్టుల సమస్యలపై మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతో జరిగిన సమావేశం.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ జర్నలిస్టులకు ఇండ్లు పంపిణీ చేసేందుకు సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నట్టు స్పష్టం చేశారు.

కాగా ఈ సమావేశంలో ప్రభుత్వం నుంచి ప్రెస్ అకాడమీకి రావాల్సిన బకాయిల చెల్లింపు, జర్నలిస్టులకు ఇండ్లు, ఇళ్ల స్థలాలు, హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ సోసైటీకి పేట్ ‌‌బషీరాబాద్‌లో స్థలం కేటాయింపు, చిన్న పత్రికల గ్రేడింగ్‌తో పాటు పలు ఇతర సమస్యలపై చర్చించారట.

అంతేకాకుండా, జర్నలిస్టుల సమస్యలన్నింటినీ కొలిక్కి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తానని కేటీఆర్ వెల్లడించారట.కాగా ఈ వార్త విన్న కొందరు మాత్రం దీని భావం ఏంటో మహాశయా అని సన్నాయి నొక్కులు నొక్కుకుంటున్నారట.

ప్రమోషన్స్ తోనే ప్రేక్షకులకు మతులు పోగొడుతున్న చిన్న సినిమాలు