టెక్సాస్ : ఆ సరస్సు వద్ద బయటపడుతున్న శవాలు .. సీరియల్ కిల్లర్ పనేనంటూ వదంతులు, ఏం జరుగుతోంది..?

టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్‌లోని లేడీ బర్డ్ లేక్‌ ఇప్పుడు అమెరికాలో చర్చనీయాంశమైంది.నెలల వ్యవధిలో ఇక్కడ 8 మంది మృతదేహాలు బయటపడటం కలకలం రేపుతోంది.

తాజాగా నిన్న ఉదయం కూడా లేడీ బర్డ్ లేక్‌లో( Lady Bird Lake ) ఓ మృతదేహాన్ని కనుగొన్నట్లు ఆస్టిన్ అగ్నిమాపక శాఖ( Austin Fire Department ) ప్రకటించడంతో ఆ ప్రాంతానికి వెళ్లాలంటేనే జనం భయపడిపోతున్నారు.

ఆస్టిన్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.మరణించిన వ్యక్తి పురుషుడు.

ఇతని మరణానికి కారణాలు తెలియకపోవడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.వరుస ఘటనల నేపథ్యంలో లేక్ పరిసరాల్లో సీరియల్ కిల్లర్ సంచరిస్తున్నాడంటూ జనం మాట్లాడుకుంటున్నారు.

"""/" / లేడీ బర్డ్ లేక్ నుంచి 10 నెలల్లో ఎనిమిది మృతదేహాలను వెలికితీయడంతో ఆ ప్రాంతంలో వదంతులు వ్యాపించాయి.

గతంలోనూ ఈ ప్రాంతంలో ఇదే తరహాలో మరణాలు జరగడం కూడా అనేక అనుమానాలకు తావిస్తోంది.

అయితే వరుస మరణాల వెనుక సీరియల్ కిల్లర్ ప్రమేయం వుందనే వాదనలను పోలీసులు తోసిపుచ్చారు.

మరణాలకు దారి తీసిన కారణాలు, ఆధారాలను వెలికితీసే పనిలో వున్నామని చెబుతున్నారు.ట్రావిస్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయంతో తాము సన్నిహితంగా పనిచేస్తున్నామని.

ఇప్పటి వరకు చోటు చేసుకున్న అన్ని మరణాలపై సమాంతరంగా విచారణ నిర్వహిస్తామని పోలీసులు వెల్లడించారు.

గతంలో జరిగిన పోస్ట్‌మార్టం నివేదికలను బట్టి మృతుల శరీరాలపై ఎలాంటి గాయం లేదని వారు చెబుతున్నారు.

"""/" / లేడీ బర్డ్ లేక్‌లో మునిగి మరణించిన కేసుల్లో మద్యం సేవించి వుండటం, రాత్రిపూట లేక్ వీక్షించేందుకు వచ్చి ప్రమాదాల బారినపడటం వంటి కోణాలపైనా తాము ఆరా తీస్తున్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు.

ఇలాంటి వ్యూ పాయింట్లను రాత్రి 10 గంటల తర్వాత మూసివేస్తామని, ఆ తర్వాతే ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు అంటున్నారు.

వరుస ఘటనల నేపథ్యంలో పార్క్‌లు, లేక్‌లను మూసివేసిన తర్వాత లోపలికి ప్రవేశించవద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

మంగళవారం ఘటనతో కలిపి ఈ ఏడాది లేడీ బర్డ్ లేక్ నుంచి ఇప్పటి వరకు పోలీసులు వెలికితీసిన మృతదేహాల సంఖ్య నాలుగుకి చేరింది.

మరణించిన వారిని జాసన్ జాన్( Jason John ) (30), క్లిఫ్టన్ ఆక్స్‌టెల్( Clifton Axtell ) (40), జోనాథన్ హానీ (33), జాన్ క్రిస్టోఫర్ హేస్ క్లార్క్ (30)లుగా గుర్తించారు.

ఈ ఏడాది మేలో ఆస్టిన్ పోలీసులు.లేడీ బర్డ్ లేక్ నుంచి బుల్లెట్ రంధ్రాలు వున్న ఓ వాహనాన్ని వెలికితీశారు.

అందులో పలువురి మృతదేహాలు కూడా బయటపడ్డాయి.వరుస మరణాల నేపథ్యంలో కేసులు, సీరియల్ కిల్లర్ వదంతుల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు గాను.

ఫేస్‌బుక్ యూజర్లు ‘‘లేడీ బర్డ్ లేక్ సీరియల్ కిల్లర్’’ పేరుతో గ్రూప్‌ను ఏర్పాటు చేశారు.

అయ్యయో.. ఈ కష్టం మరొకరికి రాకూడదుగా.. వీడియో వైరల్