అమెరికాలో మరొకరికి మరణ శిక్ష అమలు .. 11 రోజుల్లో ఎంతోమంది అంటే?
TeluguStop.com
1989లో కవల బాలికలను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటోన్న నిందితుడికి టెక్సాస్ ప్రభుత్వం మంగళవారం మరణశిక్షను అమలు చేసింది.
61 ఏళ్ల గార్సియా గ్లెన్‌వైట్( Garcia Glenn White )కి హంట్స్‌విల్లేలోని స్టేట్ పెనిటెన్షియరీలో విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత సాయంత్రం 6.
56 గంటలకు మరణించినట్లుగా అధికారులు తెలిపారు.డిసెంబర్ 1989లో అన్నెట్, బెర్నెట్ ఎడ్వర్డ్స్‌లను హత్య చేసినట్లుగా వైట్‌పై ఆరోపణలు వచ్చాయి.
కవల పిల్లల మృతదేహాలు వారి తల్లితో పాటు హ్యూస్టన్‌లోని అపార్ట్‌మెంట్‌లో లభించాయి. """/" /
సుప్రీంకోర్ట్ ( Supreme Court )అతని అభ్యర్ధలను తిరస్కరించడంతో చివరికి మరణశిక్ష ఖరారైంది.
గడిచిన 11 రోజుల్లో అమెరికాలో మరణశిక్ష అమలు చేసిన ఆరవ ఖైదీ వైట్ కావడం గమనార్హం.
హ్యూస్టన్‌కు చెందిన గ్లెన్‌వైట్‌కు ఫుట్‌బాల్ అంటే ఎంతో ఇష్టం.నివేదికల ప్రకారం .
1989లో ఘటన జరిగిన రోజున వైట్ కవల పిల్లల తల్లి బోనిటాతో కలిసి సిగరెట్ కాల్చడానికి వారి ఇంటికి వెళ్లాడు.
ఇంతలో ఏం జరిగిందో ఏమో కానీ బోనిటాను వైట్ దారుణంగా కత్తితో పోడిచాడు.
ఆమె అరుపులతో లోపల ఉన్న పిల్లలు వారి గదుల్లోంచి బయటకు రావడంతో వారిద్దరిపైనా విచక్షణారహితంగా దాడి చేశాడు.
ఓ కిరాణా దుకాణం యజమాని, మరో మహిళ మరణాల వెనుక వైట్ ప్రమేయం ఉన్నట్లుగా పోలీసులు అభియోగాలు మోపారు.
కవలలు, వారి తల్లి మరణాల వెనుక దాగివున్న మిస్టరీ దాదాపు ఆరేళ్ల పాటు పరిష్కారం కాలేదు.
ఈ క్రమంలో 1995లో కిరాణా దుకాణం యజమాని అయిన హూ వాన్ ఫామ్ మృతి కేసులో వైట్‌ను అరెస్ట్ చేయగా మిగిలిన హత్యల సంగతి బయటపడింది.
అలాగే గ్రేటా విలియమ్స్ అనే మరో మహిళను కూడా చంపినట్లుగా వైట్ అంగీకరించాడు.
"""/" /
సిట్రస్ కౌంటీ క్లానికల్ నివేదిక ప్రకారం.గ్లెన్‌వైట్ మూడు వేర్వేరు ఘటనలలో ఐదు హత్యలు చేశాడు.
అతని బాధితుల్లో ఇద్దరు టీనేజ్ ఆడపిల్లలు ఉన్నట్లుగా హ్యూస్టన్( Houston )లోని హారిస్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం తెలిపింది.
మరణశిక్షకు కొద్ది నిమిషాల ముందు డెత్ ఛాంబర్‌లో బాధిత కుటుంబాలకు వైట్ క్షమాపణలు చెప్పాడు.
నాగచైతన్య శోభితలను కలిపిన హీరో అతనేనా.. ఈ హీరోకు థ్యాంక్స్ అంటూ?