శానిటైజర్ ఏది మంచిదో ఏది కాదో ఇలా క్షణాల్లో తెలుసుకోండి!
TeluguStop.com
దేశంలో ప్రస్తుతం కరోనా కాలం నడుస్తోంది.కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది.
వైరస్ వ్యాప్తి వల్ల శానిటైజర్ ప్రతి ఒక్కరి నిత్యావసర వస్తువుల్లో భాగమైపోయింది.ప్రయాణ సమయాల్లో ప్రజల్లో చాలామంది హ్యాండ్ శానిటైజర్లను వినియోగిస్తున్నారు.
ఏవైనా కొత్త వస్తువులను తాకినా బయటకు వెళ్లి ఇంటికి వచ్చినా శానిటైజర్ తో శుభ్రం చేసుకోవడం ద్వారా చేతిలో ఉండే కరోనా వైరస్ చనిపోతుంది.
అయితే శానిటైజర్ల వినియోగం పెరగడంతో మార్కెట్లో కల్తీ శానిటైజర్లు రాజ్యమేలుతున్నాయి.పేరు మోసిన సూపర్ మార్కెట్లలో సైతం కల్తీ శానిటైజర్లను విక్రయిస్తున్నారు.
దీంతో ఏది కల్తీ శానిటైజరో ఏది అసలు శానిటైజరో కనిపెట్టడం చాలా కష్టంగా మారింది.
కల్తీ శానిటైజర్ వాడితే చేతిపై కరోనా వైరస్ ఉన్నా ఆ వైరస్ చనిపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
ఫలితంగా చేతులు శుభ్రం చేసుకున్నా వైరస్ బారిన పడే అవకాశం ఉంటుంది.అయితే కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ఏ శానిటైజర్ మంచిదో ఏ శానిటైజర్ మంచిది కాదో సులభంగా తెలుసుకోవచ్చు.
మార్కెట్ లోని నకిలీ శానిటైజర్ల వల్ల వైరస్ అంతం కాకపోగా కొత్త ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు సైతం ఉన్నాయి.
అయితే గోధుమ పిండి ద్వారా సులువుగా శానిటైజర్ క్వాలిటీని తెలుసుకునే అవకాశం ఉంటుంది.
కొద్దిగా గోధుమపిండిని తీసుకుని మనం వాడే శానిటైజర్ తో కలపాలి.గోధుమ పిండి శానిటైజర్ కు అతుక్కుందంటే అది కల్తీ శానిటైజర్ అని అలా కాకుండా గోధుమపిండి శానిటైజర్ కు అతుక్కోకపోతే నకిలీ శానిటైజర్ అని కనిపెట్టాలి.
ఈ చిట్కా పాటించి మనం ఇంట్లో వాడుతున్న శానిటైజర్ గురించి ఒక అవగాహనకు రావచ్చని నిపుణులు చెబుతున్నారు.
క్వాలిటీ లేని శానిటైజర్ అని తేలితే ఆ శానిటైజర్ ను వినియోగించకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.
ఈ యాంటీ ఏజింగ్ క్రీమ్ తో ముడతలకు చెప్పండి బై బై..?