మళ్ళీ మొదలైన ఉగ్ర దాడులు... మరో సర్జికల్ స్ట్రైక్ చేయాల్సిందేనా?

భారత దేశంలో మరల ఉగ్ర దాడులు ఎక్కడో ఒక చోట జరుగుతున్న పరిస్థితి ఉంది.

గత నెల రోజుల క్రితం జమ్మూలో జరిగిన ఉగ్రదాడిలో పలువురు జవాన్లు మరణించగా తాజాగా త్రిపురలో జరిగిన ఉగ్రదాడిలో కమాండింగ్  ఆఫీసర్ కుటుంబం సహా ఏడుగురు మృతి చెందారు.

ఈ దాడికి పాల్పడింది మేమే అంటూ పీపుల్ లిబరేషన్ ఆర్మీ అనే ఉగ్ర సంస్థ ప్రకటించింది.

అయితే ప్రస్తుతం ఈ ఉగ్ర దాడికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.

ఇప్పటికే దేశంలో ఎక్కడో ఒక చోట ఉగ్రదాడులు జరగడం చాలా బాధాకరమని ఇండియన్ ఆర్మీ, భారత ప్రభుత్వం ఈ దాడులకు పాల్పడిన వారిపై ఎదురుదాడి చేయకపోతే ఇటువంటి ఉగ్ర మూకలు మరింతగా చెలరేగే ప్రమాదముందని దేశ ప్రజలు కోరుతున్నారు.

"""/"/ భారతదేశంలో దాడులకు ఏ దేశం ఉసిగొల్పుతుందో ఆ సదరు దేశంలో మరో సారి సర్జికల్ స్ట్రైక్ చేస్తే కాని ఆ దేశానికి బుద్ధి వస్తుందని భారత్ పై దాడులు చేయాలంటే జంకె పరిస్థితి ఉంటుందని అన్ని వర్గాల ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.

అయితే ఈ తరహా ఘటనలపై మోడీ ప్రత్యక్షంగా స్పందించకున్నా మౌన వ్యూహాన్ని అమలు చేస్తూ ఒకసారిగా దాడి చేయడం మోడీ పార్క్ వ్యూహం అని మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు.

కాని ఈ తరహా దాడులతో భారత ఆర్మీని మానసికంగా  బలహీనపరచలేరని, అందుకు ధీటుగా త్వరలోనే బదులిస్తామని ఆర్మీ చీఫ్ ప్రకటించారు.

కావున ఇండియన్ ఆర్మీకి మరింత స్వేచ్చనిచ్చి దాడులకు పాల్పడిన వారికి బదులిచ్చేలా అనుమతి ఇవ్వాలని దేశంలో ఉన్న అన్ని వర్గాల  నుండి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరి నరేంద్ర మోడీ ఈ తరహా ఉగ్రదాడులపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి కఠిన నిర్ణయం తీసుకోవాలని దేశ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

మన దర్శకులతో ఇతర భాషల హీరోలు సినిమాలు చేయాలనుకోవడానికి కారణం ఏంటంటే..?