చైనా కుట్రలని తిప్పి కొట్టిన భారత్! సరిహద్దులో ఉగ్ర స్థావరాలు ద్వంసం

ఓ వైపు ఫూంచ్ సెక్టార్ లో పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదుల నుంచి భారత్ తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కొంటూ ఉంది.

ఎప్పటికప్పుడు ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడే ప్రయత్నం చేస్తున్నారు.అయితే భద్రతా దళాలు ఉగ్ర చొరబాట్లని బలంగా తిప్పి కొడుతున్నాయి.

ఇక కొద్ది రోజుల క్రితం ఉగ్ర స్థావరాలపై వైమానిక దాడులు చేసి ద్వంసం చేసారు.

మరో వైపు పాకిస్తాన్ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందంకి పోటీ పడుతూ ఉంది.

ఇదిలా ఉంటె మరో వైపు మయిన్మార్ సరిహద్దులో చైనా కూడా భారత్ ని దెబ్బ తీసేందుకు కుట్రలకి తెరతీస్తుంది.

మయిన్మార్ లో సిత్వే భారత్ మిజోరాం అనుసంధానికి చేపట్టిన కలధాన్ ప్రాజెక్ట్ ని అడ్డుకోవడానికి చైనా విశ్వప్రయత్నాలు చేస్తుంది.

తాను చేపడుతున్న సిల్క్ రోడ్ ప్రాజెక్ట్ కి కలధాన్ తో ఇబ్బంది అని భావిస్తున్న చైనా స్థానికంగా ఉగ్రవాదులని సహాయం చేస్తూ వారిని భారత్ పైకి పురిగొల్పే ప్రయత్నం చేస్తుంది.

విజోరం, అరుణాచల్ ప్రదేశ్, మయిన్మార్ లలో వేర్పాడు వాద సంస్థలని ప్రోత్సహిస్తుంది.అయితే చైనా తెరతీసిన ఈ కుట్రలకి భారత్ మయిన్మార్ భద్రతా దళాలు చెక్ పెట్టాయి.

సరిహద్దులో ఉన్న డజనుకి పైగా ఉగ్రవాద స్థావరాలని రెండు వారాల ఆపరేషన్ తో నాశనం చేసాయి.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నికపై సంచలన తీర్పు