న్యూజిలాండ్ నరమేధంలో ఐదుగురు భారతీయులు మృతి..!!!

న్యూజిలాండ్ లోని మసీదుల్లో జరిగిన్ కాల్పుల ఘటన యావత్ ప్రపంచాన్ని కదిలించింది.అత్యంత పాశవికంగా జరిగిన ఈ నరమేధంలో మృతి చెందిన వారిలో ఐదుగురు భారతీయులు ఉండటం భారత్ ని మరింత భాదించిన అంశం.

మహబూబ్‌ ఖోఖర్‌, రమీజ్‌ వోరా, ఆసీఫ్‌ వోరా, హన్సీఫ్‌ అలిబవ, ఓజైర్‌ ఖాదీర్‌ అనే భారతీయులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది.

భారత హై కమిషన్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.ఇదిలాఉంటే భాదిత కుటుంభాలకి వీసా జారీ కోసం ఆన్లైన్ లో ప్రత్యేక వెబ్సైటు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు అధికారులు.

అయితే మసీదులో ఈ నరమేధం జరగడానికి ముందు తొమ్మిది నిమిషాలలో తన కార్యాలయానికి సమాచారం అందిందని ప్రధాని జసిండా అర్డెర్న్‌ వెల్లడించారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ అంతేకాదు ఆమెతో పాటు మరొక 30 మందికి కూడా ఈ సమాచారం దుండగులు అందించినట్టుగా తెలుస్తోందని అన్నారు.

దుండగుడు దాడిని ఫేస్‌బుక్‌ ద్వారా ప్రత్యక్షప్రసారం చేయడంతో ఒక్క సారిగా ఆందోళన రేగింది.

అయితే ఈ విషయంపై వివరణ ఇవ్వాలని ప్రధాని జసిండా ఫేస్‌బుక్‌ ఉన్నతాధికారులను కోరారు.

తప్పించుకుంటూ అధికారులనే కారుతో ఢీకొట్టి .. భారత సంతతి వ్యక్తిని కాల్చిచంపిన పోలీసులు