మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం.. పెద్ద మొత్తంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికులు.. !
TeluguStop.com

ఉత్తర మెక్సికో సరిహద్దు రాష్ట్రం లోని సోనోరాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.


ఈరోజు తెల్లవారు జామున నోషీ బ్యుయెనా గనికి చెందిన ఉద్యోగులను తరలిస్తుండగా రెండు బస్సులు ఢీ కొన్నాయని సమాచారం.


కాగా ఈ ప్రమాదంలో 16 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 14 మంది తీవ్రంగా గాయ పడినట్టు అక్కడి అధికారులు వెల్లడిస్తున్నారు.
ఇకపోతే ఈ ప్రమాదం లోని బాధితులంతా నోచే బ్యూనా గనికి చెందిన వారని పోలీసులు పేర్కొన్నారు.
ఈ ప్రమాదంలో రెండు వాహనాలు పూర్తిగా ద్వంసం అవగా, చనిపోయిన వారంతా ఆ బస్సులోనే చిక్కుకు పోవడం తీవ్ర విషాదాన్ని నింపుతుంది.
ఇక మృతులంతా మెక్సికోకు చెందిన వారేనట.అయితే రెండు బస్సులు అతి వేగంతో ఉండటం తోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుందట.
కాగా ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారట.
థియేటర్‌లో “ఛావా” క్లైమాక్స్ చూస్తూ నవ్విన యువకులు.. బలవంతంగా క్షమాపణలు చెప్పించారుగా!