విశాఖ బీచ్‌: నేవీ విన్యాసాల్లో భయంకరమైన ఘటన.. వీడియో చూస్తే షాక్ అవుతారు!

విశాఖపట్నం రామకృష్ణ బీచ్ ( Visakhapatnam Ramakrishna Beach )గురువారం నాడు ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

భారత నావికాదళానికి చెందిన ఇద్దరు అధికారులు సాహసోపేత విన్యాసాలు చేస్తుండగా పెను ప్రమాదం ఎదురైంది.

తూర్పు నావికాదళం జనవరి 4న నిర్వహించ తలపెట్టిన భారీ ప్రదర్శనకు రిహార్సల్స్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

పారాచూట్ల సాయంతో గాల్లో నుంచి కిందికి దిగుతున్న ఇద్దరు నేవీ అధికారుల( Navy Officers ) పారాచూట్లు అనుకోకుండా ఒకదానికొకటి చిక్కుకుపోయాయి.

దీంతో వారి శరీరాలపై నియంత్రణ కోల్పోయి నేరుగా సముద్రంలో పడిపోయారు.ఆ సమయంలో ఒక అధికారి చేతిలో జాతీయ జెండా ఉండటం మరింత ఆందోళన కలిగించింది.

ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు క్షణకాలం పాటు భయాందోళనకు గురయ్యారు. """/" / అయితే, అప్రమత్తమైన రెస్క్యూ సిబ్బంది వెంటనే స్పందించి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

క్షణాల్లోనే లక్షల మంది ఈ వీడియోను చూసేశారు.జనవరి 4న రామకృష్ణ బీచ్‌లో ఇండియన్ నేవీ తన సత్తా చాటేందుకు భారీ ప్రదర్శన నిర్వహించనుంది.

ఈ ప్రదర్శనలో యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, అత్యాధునిక యుద్ధ విమానాలతో పాటు నేవీ బ్యాండ్, అత్యంత నైపుణ్యం కలిగిన మెరైన్ కమాండోలు( Marine Commandos ) (MARCOS) తమ విన్యాసాలను ప్రదర్శించనున్నారు.

"""/" / ఈ కార్యక్రమం ద్వారా భారత నావికాదళం దేశ రక్షణలో తమ సన్నద్ధతను, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్పనుంది.

అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలతో తమ అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకోనుంది.రిహార్సల్స్‌లో జరిగిన ఈ ఘటన ఇలాంటి విన్యాసాల్లో ఉండే ప్రమాదాలను మరోసారి గుర్తు చేసింది.

కానీ, రెస్క్యూ టీమ్ వెంటనే స్పందించిన తీరు, అధికారులను సురక్షితంగా కాపాడిన విధానం ఇండియన్ నేవీ సమర్థతకు నిదర్శనంగా నిలిచింది.

నా కూతురిని అప్పుడే అందరికీ పరిచయం చేస్తా: రామ్ చరణ్