కంచె సినిమా షూటింగ్ లో ఘోర ప్రమాదం.. సీట్ కింద బాంబులు?

ప్రముఖ రంగస్థల నటులు, రచయిత, సినిమా సంభాషణల రచయిత సాయిమాధవ్‌ బుర్రా.కృష్ణం వందే జగద్గురుం సినిమాతో సినీ సంభాషణల రచయితగా పరిచయమైన సాయి మాధవ్ తెలుగు సినీ పరిశ్రమలో విభిన్న కథలతో అభిమానులకు చేరువయ్యారు.

రంగస్థలం నుండి సినిమారంగంలోకి ప్రవేశించి సినిమాలలో నటించడమేకాకుండా పాటలు, సంభాషణలు రాస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు సాయి మాధవ్.

ఇక పోతే ఆయన తీసిన సినిమాలలో కంచె చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసింది.

అక్టోబరు 22 న విడుదలైన తెలుగు సినిమా రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో నడుస్తుంది.

రెండో ప్రపంచ యుద్ధంలో దాదాపు రెండు లక్షల మంది భారత సైనికులు పాల్గొని, నలబై వేల మంది మరణించి, మరో ముప్ఫై ఐదు వేల మంది గాయపడి, అరవై వేలమంది బందీలుగా చిక్కారన్న సత్యాన్ని పరిశోధనాత్మకంగా వెలికి తీసి, ప్రపంచం ముందు పెట్టిన సినిమా ఇది.

ఆగస్టు 15, 2015 న విడుదలైన ఈ చిత్ర మొదటి ప్రచార చిత్రం విభిన్నంగా ఉండి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నది.

రైటర్ గా ఇండోర్ లో కాకుండా, ఔట్ డోర్ లోకి వెళ్తే ప్రమాదాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని ప్రముఖ రచయిత సాయి మాధవ్ అన్నారు.

జార్జియాలో కంచె షూటింగ్ జరుగుతున్నప్పుడు తాను టెంట్ లో కూర్చొని రాసుకుంటున్నపుడు, ఆ సమయంలో యుద్ధానికి సంభందించిన సన్నివేశాలు జరుగుతున్నాయని సాయి మాధవ్ బుర్రా తెలిపారు.

"""/"/ దూరం నుంచి అరుస్తూ ఉన్నారు.కానీ నాకేంటో అర్ధం కాలేదు.

వాళ్ళు వాళ్ళ షూటింగ్ లో భాగంగా ఏదో అరుస్తున్నారు అనుకున్నాను.నా మూడ్ లో నేనుండి రాసుకుంటున్నా.

అలా రాస్తూ రాస్తూ అలా సెట్ సైడ్ చూసే సరికి అందరూ నా వైపే చూసి పెద్దగా అరుస్తున్నారు.

ఎందుకు అరుస్తున్నారు అనుకున్నా, కానీ వాళ్ళు సైగ చేసి చూపే సరికి అప్పుడు అర్థం అయింది.

నా కుర్చీ కిందే బాంబ్ ఉంది అని.వెంటనే అన్ని బ్యాగ్లన్ని సర్దుకొని వెంటనే పరిగెత్తాను అని ఆయన తెలిపారు.

ఆ సమయంలో నేను అక్కడ టెంట్ లో ఉన్నానని వాళ్ళు గుర్తించక పోయి ఉంటే సంగతి వేరేలా ఉండేది అని సాయి మాధవ్ అన్నారు.

Viral : ఇదేందయ్యా ఇది.. మాజీ ప్రియురాలి టాయిలెట్ చోరీ చేసిన ప్రియుడు..