జగన్ కు ' పరీక్షా ' కాలం ? కోర్టు సూచన తో వెనక్కి తగ్గుతారా ?
TeluguStop.com
అన్నీ బాగానే ఉన్నాయి కానీ, కొన్ని విషయాల్లో మాత్రం జగన్ఎవరి మాట వినరు.
ఆయన చెప్పిందే అందరూ వినాలి అనుకొంటారు అంటూ వైసీపీ నాయకులే జగన్ వ్యవహార శైలిపై తరచుగా విమర్శలు చేస్తూ ఉంటారు.
ఆయన నిర్ణయాలు ఆ విధంగా ఉంటాయి.ప్రస్తుతం కరోనా ఉద్రిక్తంగా మారింది.
దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసులకు తగ్గట్టుగానే ఏపీలోనూ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి.
అయితే ఇంతటి విపత్కర సమయంలో ఇంటర్ పదో తరగతి పరీక్షల నిర్వహణకు జగన్ మొగ్గు చూపడం, యధావిధిగా షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయని ప్రకటించడంపై కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాల్లో దుమారం రేగుతోంది.
జగన్ విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టి, తన పంతం నెరవేర్చుకోవాలని చూస్తున్నారని, కొద్ది రోజులుగా టిడిపి యువ నాయకుడు లోకేష్ ఆధ్వర్యంలో పెద్ద ఆందోళన నిర్వహిస్తున్నారు.
అలాగే ఈ అంశం కోర్టుకు సైతం చేరింది.నేడు ఇంటర్ పరీక్షల విషయంలో హైకోర్టు కీలక సూచనలు చేసింది.
పరీక్షలు యధాతథంగా నిర్వహించాలని చూస్తున్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని మరోసారి సమీక్షించుకోవాలని కోర్టు సూచించింది.
టిడిపి నాయకులతో పాటు, కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు హైకోర్టులో పిటిషన్ వేయడంతో, ఈ విధంగా స్పందించింది.
దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు ఈ పరీక్షల నిర్వహణలో భాగస్వాములు అవుతారని, ప్రస్తుతం ఉధృతంగా కరోనా విజృంభిస్తున్న సమయంలో పరీక్షలు నిర్వహించడం అవసరమా అంటూ కోర్టు అభిప్రాయ పడింది .
అలాగే ఇతర రాష్ట్రాల్లో ఈ పరీక్షలను రద్దు చేసినప్పుడు ఇక్కడ రద్దు చేయడానికి ఇబ్బంది ఏంటి అని కోర్టు ప్రశ్నించింది.
ఈ విపత్కర కరోనా పరిస్థితుల్లో విద్యార్థులకు ప్రమాదకరమే అని న్యాయస్థానం అభిప్రాయపడింది. """/"/
అలాగే కరోనా వచ్చిన విద్యార్థులు ఈ పరీక్షలు ఎలా రాయాలి అని కోర్టు ప్రశ్నించింది.
వారికి విడిగా పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వ న్యాయవాది చెప్పడం పై కోర్టు అభ్యంతరం తెలిపింది.
ఇది ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించింది.ఈ కేసును మూడో తేదీకి వాయిదా వేస్తున్నామని, అప్పటిలోగా ప్రభుత్వం నిర్ణయం ఏమిటో చెప్పాలని కోర్టు ఆదేశించింది.
దాదాపుగా కోర్టు కూడా పరీక్షలను రద్దు చేయాలనే విధంగానే వ్యాఖ్యానించడం, వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం, కరోనా కేసులు రోజుకు 15,000 కు పైగా ఏపీలో నమోదవుతున్న ఈ పరిస్థితుల్లో జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది.
అసలు ఈ పరీక్షలు రద్దు వ్యవహారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోరాటం మొదలు పెట్టక పోయుంటే, జగన్ ఎప్పుడో వీటిని రద్దు చేసే వారిని, ఇప్పుడు రద్దు చేసినా, ఆ క్రెడిట్ టిడిపి ఖాతాలోకి వెళ్తుందనే ఉద్దేశంతోనే ఇంత పంతానికి వెళ్తున్నారనే విమర్శలు ఎక్కువయ్యాయి.
మూడో తేదీ లోగా దీనిపై జగన్ నిర్ణయం ఏమిటి అనేది స్పష్టంగా తేలిపోనుండడంతో అప్పటి వరకు విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఉత్కంఠ ఇదేవిధంగా కొనసాగనుంది.
అల్లు అర్జున్ జాతకం పై వేణు స్వామి కామెంట్స్… అసలు సినిమా ముందుంది అంటూ?