ఆ రాష్ట్రంలో ద‌డ పుట్టిస్తున్న వింత వ్యాధి..

ఇప్ప‌టికే క‌రోనా లాంటి రోగాలు మ‌నుషుల‌ను నానా ఇబ్బందులు పెడుతున్నాయి.ఇప్టటికే సెకండ్ వేవ్ కార‌ణంగా మ‌న దేశం ఎంత‌లా అత‌లాకుత‌లం అవుతుందో చూస్తేనే ఉన్నాం.

అన్ని దేశాల క‌న్నా కూడా మ‌న దేశంలోనే ఈ సెకండ్ వేవ్ ప్ర‌భావం తీవ్రంగా ప‌డింది.

అయితే దీనికి తోడుగా మ‌న దేశంలోనే చాలా ర‌కాల రోగాలు పుట్టుకొస్తున్నాయి.ఇప్ప‌టికే బ్లాక్ ఫంగ‌స్ వ‌ణికిస్తే ఇప్పుడు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో కొత్త వ్యాధి త‌యారైంది.

ఈ వ్యాధి అంతుచిక్కకుండా పెద్ద ఎత్తున చిన్నారులను బలితీసుకుంటోంది.ఇప్ప‌టి వ‌ర‌కు గుర్తు తెలియని ఎవ‌రూ గుర్తించ‌ని ఈ రోగం వ‌ల్ల యూపీలో అతలాకుతలం అవుతున్నారు జ‌నాలు.

అక్క‌డి అధికారుల చెప్పిన వివ‌రాల ప్ర‌కారం ఇప్ప‌టికే ఈ వ్యాధి కార‌ణంగా దాదాపుగా 70 మంది ప్రాణాలు విడిచార‌ని తెలుస్తోంది.

దీని కార‌ణంగా ముందు ముందు చాలామంది చనిపోతార‌ని భ‌య‌ప‌డుతున్నారు.అంతుచిక్కని వ్యాధి కావ‌క‌డంతో డాక్ట‌ర్లు కూడా స‌రైన చికిత్స‌ను అందించ‌లేక‌పోతున్నార‌ని స‌మ‌చారాం.

దీని బారిన ప‌డిన వారిలో అధిక జ్వరంఅలాగే రక్తంలో ప్లేట్‌లెట్స్ ఒక్క‌సారిగా తగ్గిపోవడం ఇంకా కొందరిలో అయితే తీవ్రమైన నిర్జలీకరణ వ‌స్తున్న‌ట్టు డాక్టర్లు చెబుతున్నారు.

"""/" / అయితే ఈ వ్యాధి కారణంగానే ఉత్తరప్రదేశ్ లోని ఒక్క ఫిరోజాబాద్ ప్రాంతంలోనే దాదాపుగా 50 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.

దీంతో పాటు రాష్ట్రంలోని ఆగ్రా అలాగే మధుర, మెయిన్‌పురి లాంటి ఏరియాల్లో పరిస్థితి దారుణంగా ఉంద‌ని తెలుస్తోంది.

అయితే జ్వ‌రాలు వ‌చ్చిన వారిలో జపనీస్ ఫీవర్ ఎన్సెఫాలిటిస్ వైర‌స్ లక్షణాలు కూడా వ‌స్తున్నాయ‌ని డాక్టర్లు చెబుతున్నారు.

కాగా అటు కేంద్రం కూడా దీని ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రించింది.ఇక ఐసీఎంఆర్ కూడా ఈ వింత వ్యాధిని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివ‌రించింది.

కానీ ప్ర‌జ‌లు మాత్రం ఈ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచిస్తున్నారు డాక్ట‌ర్లు.

మహేష్ బాబుతో ఆ సినిమా చేసి తప్పు చేశాను.. శ్రీనువైట్ల సంచలన వ్యాఖ్యలు!