గుంటూరు జిల్లా ఆటోనగర్ లో టెన్షన్ టెన్షన్..!
TeluguStop.com
గుంటూరు జిల్లా ఆటోనగర్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.పోలీసుల కాన్వాయ్ ను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.
ఈ క్రమంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.కాగా టీడీపీ ప్రెసిడెంట్ చంద్రబాబు నంద్యాల పర్యటనలో ఉండగా ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఆయనను రోడ్డు మార్గం ద్వారా విజయవాడకు తరలిస్తున్నారు.చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు రోడ్లపై బైఠాయించి నిరసన కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే.
ముందుగా కుంచనపల్లి సిట్ కార్యాలయానికి చంద్రబాబును తరలించనున్న సీఐడీ అధికారులు ఆయనను మరోసారి ప్రశ్నించే అవకాశం ఉంది.
అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తారు.పరీక్షలు పూర్తయిన తరువాత ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
బాలయ్య సినిమాకు పోటీగా ప్రభాస్ సినిమా రిలీజ్ కానుందా.. రిలీజయ్యేది అప్పుడేనా?