అయితే మొత్తం ఆరు నియోజకవర్గాల్లో కూటమిపై రెబల్ అభ్యర్థులు పోటీ చేయనున్నారు.ఈ మేరకు ఎన్డీయే కూటమి తరపున ఆరు స్థానాల్లో రెబల్ అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
విజయనగరం, పోలవరం, ఉండి, నూజివీడు, కావలి మరియు గన్నవరం నియోజకవర్గాల్లో రెబల్ అభ్యర్థులు బరిలో నిలుస్తూ నామినేషన్లు వేశారు.
"""/" /
ఈ మేరకు కూటమిపై వ్యతిరేకంగా విజయనగరంలో మీసాల గీత( Meesala Geetha ), పోలవరంలో సూర్యచంద్రరావు, ఉండిలో శివరామరాజు, గన్నవరంలో కొర్రపోలు శ్రీనివాసరావు, నూజివీడులో ముద్దరబోయిన వెంకటేశ్వర రావు, కావలిలో పసుపులేటి సుధాకర్ రెబల్స్ గా నిలిచారు.
ఈ నేపథ్యంలో రెబల్ అభ్యర్థులతో ఇప్పటికే కూటమి అధిష్టానాలు చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేదు.
ఈ క్రమంలో రెబల్స్ నామినేషన్ల ఉపసంహరణ వ్యవహారంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
రానా షాప్ లో పుట్టగొడుగులు 5 లక్షలు.. చెరకు రసం 275.. ఇంత రేటుకు కారణాలివే!