విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర ఉద్రిక్తత

విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది.విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల నాయకులు రాస్తారోకో చేస్తున్నారు.

ఈ క్రమంలోనే కూర్మన్నపాలెం దగ్గర ఉక్కు పోరాట కమిటీ జాతీయ రహదారిపై బైఠాయించింది.

అదానీ, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు.రంగంలోకి దిగిన పోలీసులు కార్మిక సంఘాల నేతలను అదుపులోకి తీసుకుని పీఎస్ కు తరలించారు.

తలనొప్పిగా ఉన్నప్పుడు అస్సలు చేయకూడని తప్పులు ఇవే!