విజయవాడ ఏసీబీ కోర్టు దగ్గర ఉద్రిక్తత
TeluguStop.com
విజయవాడలోని ఏసీబీ కోర్టు దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.కోర్టు పరిసర ప్రాంతాల్లో ఉన్న టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.
ఈ క్రమంలో పోలీసులకు, పార్టీ శ్రేణులకు మధ్య చెలరేగిన వాగ్వివాదం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.
దీంతో పోలీసుల జులం నశించాలంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.
మరోవైపు అరెస్ట్ చేసిన టీడీపీ శ్రేణులను అక్కడి నుంచి తరలిస్తున్నారని తెలుస్తోంది.కాగా ఏసీబీ కోర్టు దగ్గర సుమారు ఐదు వందల మంది పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే.
కాగా కోర్టులో స్కిల్ డెవలప్ మెంట్ కేసుపై విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.
ట్రంప్ ఆ ప్లాన్ ప్రకటించగానే.. నవ్వు ఆపుకోలేకపోయిన హిల్లరీ క్లింటన్!