కాకినాడలో సుబ్రమణ్యం ఇంటి దగ్గర ఉద్రిక్తత

కాకినాడ : కాకినాడలో సుబ్రమణ్యం ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది.సుబ్రమణ్యం మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు పోలీసులు వచ్చారు.

మృతుడి కుటుంబీకులు అంబులెన్స్‌ను అడ్డుకున్నారు.వైసీపీ ఎమ్మెల్సీ(YCP MLC) అనంతబాబుకు వ్యతిరేకంగా బాధితులు నినాదాలు చేశారు.

అనంతబాబును అరెస్ట్‌ చేయాలని మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు.అసలేం జరిగిందంటే.

 వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారులో అనుమానాస్పదంగా యువకుడి మృతదేహం లభించింది.ఆ యువకుడ్ని గతంలో ఎమ్మెల్సీ దగ్గర డ్రైవర్‌గా (Driver) పనిచేసిన సుబ్రమణ్యంగా గుర్తించారు.

నిన్న రాత్రి తమ కొడుకును ఎమ్మెల్సీ తీసుకెళ్లారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.అయితే అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడంటూ మృతదేహాన్ని ఎమ్మెల్సీ కారులో తీసుకుని వచ్చారు.

కాగా.బాధితుల ఆందోళనతో అనంతబాబు కారు వదిలి వెళ్లిపోయారు.

సుబ్రమణ్యంను హత్య చేశారంటూ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి7, మంగళవారం 2025