వైఎస్ షర్మిల ర్యాలీలో ఉద్రిక్తత..!!

విజయవాడ (Vijayawada)లో కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) నిర్వహిస్తున్న ర్యాలీలో తీవ్ర ఉద్రిక్తత (High Tension) నెలకొంది.

ర్యాలీలో పాల్గొన్న షర్మిల కాన్వాయ్ లోని వాహనాలను పోలీసులు దారి మళ్లించారు.ఈ క్రమంలో షర్మిలతో పాటు మరో నాలుగు వాహనాలను మాత్రమే రామవరప్పాడు (Ramavarappadu) మీదుగా వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు.

"""/" / దీంతో పోలీసుల తీరుపై నిరసనగా షర్మిల కాన్వాయ్ ను మధ్యలోనే నిలిపివేశారని తెలుస్తోంది.

తీవ్ర ఆగ్రహానికి గురైన షర్మిల పోలీసులు నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.కావాలనే తమ కాన్వాయ్ ను దారి మళ్లించారని ఆరోపించారు.

ఈ క్రమంలోనే తమను చూసి ప్రభుత్వానికి భయమేస్తుందా అని ప్రశ్నించారు.

వీడియో: వీడేం బైకర్ రా బాబు.. బస్సును బోల్తా కొట్టించాడు.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!