కాంగ్రెస్‌కు దూకూడుతో టీఆర్ఎస్‌లో టెన్షన్.. టెన్షన్

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలపడుతోంది.ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ పార్టీలోకి చేరికలు పెరుగుతున్నాయి.

ఇటీవల హైదరాబాద్ కార్పొరేటర్, దివంగత పీజేఆర్ కుమార్తె విజయారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం జెడ్పీటీసీ కాంతారావు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్నారు.

వాళ్లిద్దరూ టీఆర్ఎస్ పార్టీ నుంచే కాంగ్రెస్ పార్టీలోకి వలస వెళ్లారు.దీంతో తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్‌లో టెన్షన్ ప్రారంభమైంది.

రేవంత్‌రెడ్డి టీపీసీసీ పగ్గాలు అందుకున్న తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగింది.

ఆయన దూకుడుగా వ్యవహరిస్తుండటంతో టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి.

టీఆర్ఎస్ జడ్పీ ఛైర్‌పర్సన్‌గా ఉన్న నల్లాల భాగ్యలక్ష్మితోపాటు ఆమె భర్త మాజీ ఎమ్మెల్యే ఓదెలును చేర్చుకోవడం ద్వారా అధికార పార్టీకి కాంగ్రెస్ పార్టీ తొలి షాక్ ఇచ్చింది.

ఈ షాక్ నుంచి గులాబీ పార్టీ తేరుకోకముందే గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కార్పొరేటర్ పీజేఆర్ తనయ విజయారెడ్డిని పార్టీలో చేర్చుకుని మరో షాక్ ఇచ్చింది.

"""/"/ రానున్న కాలంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి మరిన్ని వలసలు ఉంటాయని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

పలు జిల్లాలలో టీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి.ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు, ఉమ్మడి ఖమ్మం జిల్లాల నుంచి కూడా వలసలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ జాబితాలో నాగర్ కర్నూల్ జిల్లా జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు.

ఈ చేరికలు విడతల వారీగా జరగనున్నాయని ప్రచారం జరుగుతోంది.వరుసగా తమ పార్టీ నుంచి పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తుండటంతో టీఆర్ఎస్ అధిష్టానంలో గుబులు మొదలైంది.

ఒకవైపు జాతీయ రాజకీయాలు అంటూ కేసీఆర్ నిమగ్నం కాగా ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు ఎదురుకావడం మంచిది కాదని గులాబీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో స్వయంగా మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగి ఆయా జిల్లాల నేతలకు ఫోన్లు చేసి తొందరపడొద్దని, కాంగ్రెస్ పార్టీలో చేరొద్దని సూచిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Tillu Square Movie : టిల్లు స్క్వేర్ మూవీ ఫస్ట్ రివ్యూ.. ఆ సీన్లు అభిమానులకు ఫుల్ కిక్కు ఇవ్వడం ఖాయమా?