ఏలూరు జిల్లా పెదపాడు మండలంలో ఉద్రిక్తత

ఏలూరు జిల్లా పెదపాడు మండలంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.వీరమ్మగుంట పంచాయతీ ఉపఎన్నికల్లో ఘర్షణ వాతావరణం ఏర్పడింది.

పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ బాహాబాహీకి దిగాయి.ఇందులో భాగంగా ఇరు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు పరస్పర దాడులకు పాల్పడ్డారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరుపార్టీలకు చెందిన నేతలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.

అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఆందోళనకారులపై లాఠీ ఛార్జ్ చేశారు.దీంతో పోలింగ్ కేంద్రం వద్ద హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

ఈ క్రమంలోనే పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

లిప్ పిగ్మెంటేషన్ కు కారణాలేంటి.. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తెలుసా?