శ్రీ సత్యసాయి జిల్లా ఓబులదేవర చెరువులో ఉద్రిక్తత

శ్రీ సత్యసాయి జిల్లా ఓబులదేవర చెరువులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య వివాదం రాజుకుంది.

ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటూ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ రాస్తారోకో నిర్వహించింది.

బ్యాంకులకు రుణాలు ఎగవేశారని ఎమ్మెల్యేపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో టీడీపీ నేతలు రాస్తారోకో చేపట్టారు.

అయితే టీడీపీ నేతల రాస్తారోకోను వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు.ఈ క్రమంలోనే పల్లె రఘునాథ్ రెడ్డి వాహనాన్ని అడ్డుకోవడంతో టీడీపీ, వైసీపీ శ్రేణులు మధ్య వాగ్వివాదం జరిగింది.

నిజనిజాలు తెలుసుకోకుండా రాస్తారోకో చేస్తారా అంటూ వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలం నుంచి పల్లె రఘునాథ్ రెడ్డిని పంపించారు.

దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

నదియాతో ప్రేమాయణం గురించి బయటపెట్టిన సీనియర్ నటుడు సురేష్.. ఏం జరిగిందంటే?