మేడ్చల్ జిల్లా కాప్రాలో ఉద్రిక్తత

మేడ్చల్ జిల్లాలోని కాప్రాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.కాప్రా పరిధిలోని జమ్మిగడ్డ శ్మశానవాటిక సమీపంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చివేశారు.

పోలీసు బందోబస్తు మధ్యన జేసీబీలతో కట్టడాలను అధికారులు కూల్చివేశారు.ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 199 లో అక్రమ కట్టడాలు వెలిశాయి.

ఈ ఉదయం అధికారులు కూల్చివేతలను చేపట్టగా స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

ఈ నేపథ్యంలో స్థానికులకు, అధికారులకు మధ్య వాగ్వివాదం చెలరేగడంతో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

టీమిండియా అభిమానులకు బ్యాడ్ న్యూస్.. గాయంతో జస్ప్రీత్ బుమ్రా అవుట్?