కామారెడ్డి జిల్లా మర్రితండా, నెమలిగుట్ట తండాలో ఉద్రిక్తత

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని మర్రితండా మరియు నెమలిగుట్ట తండాలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

తమ పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తండా వాసులు అటవీ భూమిని చదును చేశారు.

అటవీ భూమిలో అధికారులు నాటిన చెట్లను తండా వాసులు దున్నేశారు.సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని తండావాసులను అడ్డుకున్నారు.

ఈ క్రమంలో ఫారెస్ట్ అధికారులకు, తండా వాసులకు మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.

అనంతరం రెండు ట్రాక్టర్లను ఫారెస్ట్ అధికారులు సీజ్ చేయగా.ఫారెస్ట్ భూమి వద్ద భారీగా మోహరించారు.

ఈ రెండు రెమెడీస్ ను పాటిస్తే హెయిర్ ఫాల్ అన్న మాటే అనరు!