మంగళగిరి నియోజకవర్గంలో ఉద్రిక్తత
TeluguStop.com
అమరావతిలోని మంగళగిరి నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.రేపటి నుంచి మంగళగిరిలో టీడీపీ నేత నారా లోకేశ్ పాదయాత్ర కొనసాగనుంది.
ఈ క్రమంలో లోకేశ్ కు స్వాగతం తెలుపుతూ పార్టీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
అయితే టీడీపీ శ్రేణులు చేస్తున్న ఫ్లెక్సీల ఏర్పాటును టౌన్ ప్లానింగ్ అధికారులు అడ్డుకున్నారు.
దీంతో తీవ్రంగా మండిపడిన టీడీపీ నేతలు మంగళగిరి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు.
ఈ క్రమంలో టీడీపీ నేతలను కలిసేందుకు మంగళగిరి కార్పొరేషన్ కమిషనర్ నిరాకరించారు.ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా పోలీసులు భారీగా మోహరించారు.
ఏసు భాయిగా రాబోతున్న నటి రష్మిక మందన్న….మరో హిట్ గ్యారెంటీ?