కర్నూలు జిల్లా ఆదోనిలో టెన్షన్..టెన్షన్
TeluguStop.com
కర్నూలు జిల్లా ఆదోనిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.టీడీపీ నేత నారా లోకేశ్ నిర్వహిస్తున్న ‘యువగళం ’ పాదయాత్రను వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించారు.
రాయలసీమ ద్రోహీ నారా లోకేశ్ ఆదోనికి రావొద్దంటూ నినాదాలు చేశారు.కర్నూలులో హైకోర్టుకు టీడీపీ మద్ధతు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తల వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలను అడ్డుకున్నారు.
రెండు పార్టీ శ్రేణులకు నచ్చ జెప్పేందుకు ప్రయత్నించగా ఫలితం లేకపోవడంతో పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టారు.
ఈ నేపథ్యంలో ఆదోనీలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.
పురుషుల్లో హెయిర్ ఫాల్ ను అరికట్టే బెస్ట్ సొల్యూషన్ ఇది.. డోంట్ మిస్..!