జగిత్యాల జిల్లా కోరుట్లలో ఉద్రిక్తత

జగిత్యాల జిల్లా కోరుట్లలో ఉద్రిక్తత నెలకొంది.సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో మహిళలు గుడిసెల పోరాటం కార్యక్రమం చేపట్టారు.

ప్రభుత్వ స్థలంలో మహిళలు గుడిసెలు వేశారు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీపీఐ నాయకులను అరెస్ట్ చేశారు.

ఈ నేపథ్యంలో అదుపులోకి తీసుకున్న నాయకులను విడిచి పెట్టాలని డిమాండ్ చేస్తూ మహిళలు ర్యాలీగా ఆర్డీవో కార్యాలయానికి బయలుదేరారు.

ఈ క్రమంలో పోలీసులు మహిళలను అడ్డుకునేందుకు ప్రయత్నించగా టెన్షన్ వాతావరణం ఏర్పడింది.అనంతరం నిరసన చేస్తున్న మహిళలను అదుపులోకి తీసుకున్నారు.

పథకాల పేర్లు మార్పు : జగన్ మార్క్ కు చెక్ పెడుతున్న బాబు