హైదరాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత
TeluguStop.com
హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం ఏర్పడింది.ఇవాళ జీహెచ్ఎంసీ కార్యాలయ ముట్టడికి కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో గన్ పార్క్ నుంచి జీహెచ్ఎంసీ కార్యాలయం వరకు కాంగ్రెస్ భారీ ర్యాలీ నిర్వహిస్తుంది.
ఈ క్రమంలోనే కార్యాలయం గేట్లను దాటి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు.దీంతో నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
కాగా ఇటీవల గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో ప్రజలు అల్లాడుతుంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
అనంతరం వరద బాధితులకు వెంటనే రూ.10 వేల సాయం అందించాలని, శాశ్వత పరిష్కారం చూపించాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలుగు వాళ్ళతోనే మాకు పోటీ అంటున్న తమిళ్ డైరెక్టర్స్…