చంద్రబాబు చిత్తూరు పర్యటనలో టెన్షన్.. టెన్షన్..!

టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ఈ క్రమంలో పుంగనూరు సమీపంలోని భీమగానిపల్లిలో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.

వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగడంతో ఇరు వర్గాలకు చెందిన వ్యక్తులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు.

ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పార్టీల వర్గీయులపై లాఠీ ఛార్జ్ చేయడంతో పాటు బాష్పవాయువు ప్రయోగించారు.

కాగా అంతకముందే అన్నమయ్య జిల్లాలోని అంగళ్లులో కూడా ఇదే తరహాలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే.

టీడీపీ బ్యానర్లను చించివేయడంతో ఘర్షణ చెలరేగి వైసీపీ, టీడీపీ కార్యకర్తలు పరస్పర దాడులకు పాల్పడ్డారు.

వామ్మో.. ఇలాంటి గుడ్లు తినేముందు జాగ్రత్త సుమీ.!