Ex MLA Ramakrishna Reddy : తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో ఉద్రిక్తత

తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని( Anaparthi Constituency ) రామవరంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

కార్యకర్తలతో కలిసి అనపర్తి వెళ్లేందుకు నివాసం నుంచి బయటకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని( Ex MLA Ramakrishna Reddy ) పోలీసులు అరెస్ట్ చేశారు.

అనంతరం ఆయనను పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు.అయితే పోలీసులను, టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు.

ఈ క్రమంలో పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం జరగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

"""/" / బారికేడ్లను ఎత్తివేసిన టీడీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు.

మరోవైపు అనపర్తిలో నియోజకవర్గంలోని కార్యకర్తలతో ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి( MLA Satya Suryanarayana Reddy ) సమావేశం అయ్యారు.

అయితే గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

దాసరి, కృష్ణంరాజుకు మధ్య పెద్ద గొడవ.. ఆయన్ను తీసేసి కృష్ణకు ఛాన్స్..?