అనంతపురం అర్బన్ టీడీపీ ప్రచారంలో ఉద్రిక్తత

అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టీడీపీ( TDP ) నిర్వహిస్తున్న ప్రచారంలో ఉద్రిక్తత నెలకొంది.

గుత్తి రోడ్డులో టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్( Daggubati Prasad ) ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి( Ex MLA Prabhakar Chowdary ) వర్గీయులు ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.

నల్ల జెండాలు, నల్ల రిబ్బన్లు కట్టుకుని అర్ధనగ్న ప్రదర్శన చేశారు. """/" / గో బ్యాక్ ప్రసాద్ అంటూ ప్రభాకర్ చౌదరి వర్గీయులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

అనంతరం అర్బన్ నియోజకవర్గ( Anantapur Urban Constituency ) టికెట్ ను ప్రభాకర్ చౌదరికే ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ క్రమంలోనే అసెంబ్లీ అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్ తో పాటు ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణను కూడా అడ్డుకున్నారు.

దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

కెనడాలో స్టడీ వీసా నిబంధనలు కఠినతరం.. భయాందోళనలో భారతీయ విద్యార్ధులు