అనంతపురం జిల్లా యల్లనూరు పీఎస్ వద్ద ఉద్రిక్తత
TeluguStop.com
అనంతపురం జిల్లా యల్లనూరు పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.పీఎస్ వద్ద ఎమ్మెల్యే పెద్దారెడ్డి బైఠాయించి నిరసనకు దిగారు.
దంతలపల్లిలో నిన్న వైసీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగిన విషయం తెలిసిందే.
ఎమ్మెల్యే పెద్దారెడ్డి, నారాయణ రెడ్డి వర్గీయుల మధ్య వివాదం నెలకొంది.వేట కొడవళ్లు, కర్రలతో ఇరు వర్గాలు పరస్పరం దాడులకు పాల్పడ్డారు.
ఈ ఘటనలో ఐదుగురికి గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.దీంతో ఇరు వర్గాలపై యల్లనూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారంటూ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే యల్లనూరు పీఎస్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
బయట రూ.100, 200లకు చెప్పులు, బూట్లు కొంటున్నారా? అవి ఎక్కడి నుంచి వస్తాయంటే?