సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వద్ద టెన్షన్ వాతావరణం ఏర్పడింది.ఆస్పత్రిలో డెలివరీ కోసం వెళ్లిన మహిళ మృతి చెందింది.

నారాయణఖేడ్ సమీపంలోని బచ్చుపల్లికి చెందిన మహిళ పురిటి నొప్పులతో ఈనెల 20వ తేదీన ఆస్పత్రిలో చేరింది.

సాధారణ ప్రసవం చేస్తామని వైద్యులు తెలిపారు.అయితే,  నిన్న మహిళ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో డెలివరీ చేశారు.

ఈ క్రమంలో ముందు శిశువు మృతిచెందగా.చికిత్స పొందుతూ ఇవాళ తల్లి మృతిచెందింది.

దీంతో బాలింత కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.  తల్లీబిడ్డ మృతిచెందడానికి వైద్యులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఆఫ్రికాలో భారతీయ ట్రావెల్ వ్లాగర్‌కు ఊహించని షాక్.. ఏం జరిగిందో మీరే చూడండి..