కృష్ణా జిల్లా ఆర్.పేట పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత

కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఆర్.పేట పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

మహాత్మ గాంధీపై ఎస్సీ కమిషన్ చైర్మన్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే విక్టర్ ప్రసాద్ పై టీడీపీ నేత కొల్లు రవీంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే, ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు రిసిప్ట్ ఇవ్వలేదని సమాచారం.దీంతో ఫిర్యాదు చేసినట్లు రిసిప్ట్ ఇవ్వాలంటూ టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.

పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు.ఈ క్రమంలో పార్టీ నేతలు భారీగా పీఎస్ వద్దకు రావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.

ట్రోలర్స్ కి కౌంటర్ ఇచ్చిన అనిల్ రావిపూడి…