కర్నూలు జిల్లా మౌర్య ఇన్ హోటల్ వద్ద ఉద్రిక్తత
TeluguStop.com
కర్నూలు జిల్లాలోని మౌర్య ఇన్ హోటల్ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఉంటున్న హోటల్ ముందు న్యాయవాదులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
రంగంలోకి దిగన పోలీసులు న్యాయవాదులను అడ్డుకున్నారు.రాయలసీమ ద్రోహి చంద్రబాబు గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
అనంతరం పాలన వికేంద్రీకరణపై చంద్రబాబు వైఖరి ఏంటో చెప్పాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు.
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడానికి మద్ధతు తెలపాలన్నారు.ఈ నేపథ్యంలో పోలీసులకు, లాయర్లకు మధ్య చెలరేగిన వాగ్వివాదం తోపులాటకు దారి తీసింది.
దీంతో ఉద్రిక్తత నెలకొంది.
ఇదేం ఆట.. భార్యల చేతిలో భర్తలు ఇలా ఓడిపోతున్నారు (వీడియో)