నాగర్ కర్నూలు జిల్లా మన్ననూర్ గురుకుల పాఠశాల వద్ద ఉద్రిక్తత

నాగర్ కర్నూలు జిల్లా మన్ననూర్ గురుకుల పాఠశాల వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

గత రాత్రి నిఖిత అనే ఏడో తరగతి విద్యార్థిని తరగతి గదిలోని ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో స్కూల్ వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.నిఖిత ఆత్మహత్యకు ప్రిన్సిపల్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

ప్రిన్సిపల్ వేధింపులు తాళలేకనే నిఖిత బలవన్మరణం చెందిందని పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు.దీంతో గురుకుల పాఠశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది.

కీర్తి సురేష్ ఆంటోని జోడీ క్యూట్ అంటూ కామెంట్లు.. కలకాలం అన్యోన్యంగా ఉండాలంటూ?