హైదరాబాద్ సిట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్ సిట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది.సిట్ ఎదుట హాజరయ్యేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఒక్కడినే అధికారులు కార్యాలయంలోకి వచ్చేందుకు అనుమతిని ఇచ్చారు.

అయితే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ నెస్ కింద రేవంత్ రెడ్డి సిట్ ఎదుట హాజరైయ్యారు.

ఇందులో భాగంగా తన దగ్గర ఉన్న ఆధారాలను రేవంత్ రెడ్డి అధికారులకు అందించనున్నారు.

మరోవైపు సిట్ ఆఫీస్ దగ్గర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో జరిగిన వాగ్వివాదం తోపులాటకు దారి తీసింది.దీంతో సిట్ కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

ఈ క్రమంలో కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు కార్యాలయం వద్ద భారీగా మోహరించారు.

Betway: Practical Guide To Player Safety And Responsible Gambling