అనంతపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద టెన్షన్..!

అనంతపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రికత్త నెలకొంది.కార్యాలయం ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.

తన స్థలాన్ని బావ కుమారులు ఆక్రమించి దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఎమ్మార్వోకి ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని బాధిత మహిళ ఆరోపిస్తుంది.

ఈ నేపథ్యంలోనే నాగలక్ష్మీ పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది.వెంటనే గమనించిన కార్యాలయ సిబ్బంది బాధిత మహిళను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం నాగలక్ష్మీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం.అయితే దీనిపై స్పందించిన రెవెన్యూ అధికారులు మహిళ భర్త పేరు మీదనే స్థలం ఉందని వెల్లడించారు.

ఆస్ట్రేలియాలోని భారత కాన్సులేట్ కార్యాలయంపై విద్వేష దాడి