ఆ రిపోర్ట్ లతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ల్లో టెన్షన్
TeluguStop.com
తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడేకొద్దీ బీఆర్ఎస్( Brs Party ) అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ స్పీడ్ పెంచుతున్నారు.
పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేయడంతో పాటు , రాబోయే ఎన్నికల్లో ఎవరికి టిక్కెట్లు కేటాయించాలనే విషయం పైన ఒకవైపు కసరత్తు చేస్తున్నారు.
అలాగే జనాల్లోకి పార్టీ నాయకులు వెళ్లే విధంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. """/" /
దీనిలో భాగంగానే బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది .
ఈ ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతున్న తీరుపై ఎప్పటికప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కెసిఆర్ రిపోర్టులు తెప్పించుకుంటున్నారు .
దీనికోసం ఒక ప్రత్యేక కమిటీని కూడా నియమించారు.అయితే ఈ కమిటీ రిపోర్ట్ తమకు అనుకూలంగా ఇచ్చిందా వ్యతిరేకంగా ఇచ్చిందా అనే విషయం తెలియక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారు.
"""/" /
ప్రస్తుతం ఆత్మీయ సమ్మేళనాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై వచ్చిన నివేదిక ఆధారంగానే రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశం ఉండడంతో, ఈ విషయంలో ఎక్కువగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు కంగారు పడుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నెల రోజులుగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తోంది .ఈ సందర్భంగా అనేక చోట్ల గ్రూపు రాజకీయాలు బయటపడ్డాయి.
అనేక వివాదాలు ఏర్పడ్డాయి.ఎక్కడికక్కడ స్థానికంగా నెలకొన్న సమస్యలపై పార్టీ క్యాడర్ ఎమ్మెల్యేలను నిలదీస్తూ ఉండడం వంటివి బీఆర్ఎస్ అధిష్టానానికి ఎప్పటికప్పుడు నివేదికల రూపంలో అందుతున్నాయి.
బీఆర్ఎస్ కీలక నేత ఎమ్మెల్సీ మధుసూదనాచార్య( Madhusudhana Chary ) ఆధ్వర్యంలో ప్రోగ్రాం అమలు కమిటీని కేసీఆర్ నియమించారు.
"""/" /
ఈ కమిటీ ప్రతిరోజు నియోజకవర్గాల వారీగా నివేదిక రూపొందించి కెసిఆర్( KCR ) కు అందిస్తున్నారు.
ఈ నివేదికలో ఎమ్మెల్యేల పనితీరు, క్యాడర్ తో వారికున్న సన్నిహిత సంబంధాలు, చోటుచేసుకుంటున్న వివాదాలు అన్ని అధినేతకు ఎప్పటికప్పుడు చేరిపోతూ ఉండడం వంటివి బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే లకు గుబులు రేపుతున్నాయి.
ఇప్పటికే ఈ రిపోర్టుల ఆధారంగా కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే లను మార్చాలని బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించుకుండదట.
వీడియో: సెల్ఫ్ డ్రైవింగ్ కారులో ప్రయాణిస్తున్న యూఎస్ మహిళకు షాక్..